Cinetollywood

ఆరోజే మొద‌లుపెడ‌తా అంటున్న వెంక‌టేశ్ ? 

Venkatesh new movie Starts on his birthday | cinetollywood

విక్టరీ వెంక‌టేశ్ స‌రికొత్త సినిమాలు తీస్తూ ఉంటారు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయ‌డంతో  వెంక‌టేశ్ మంచి పేరు తెచ్చుకున్నారు.. ఇక మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డంలో కూడా వెంక‌టేష్ ముందు ఉంటారు .. తాజాగా ఆయ‌న గురు సినిమా హిట్ త‌ర్వాత, ఏ సినిమా ప‌ట్టాలెక్కిస్తారు అనేదానిపై టాలీవుడ్ లో అనేక వార్త‌లు వినిపించాయి.. కాని ఇప్పుడు ఆయ‌న కొత్త సినిమా పై క్లారిటీ వ‌చ్చింది..డిసెంబర్ 13 విక్టరీ వెంకటేశ్‌ బర్త్‌డే. ఆ రోజునే కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారు వెంక‌టేశ్.

ద‌ర్శ‌కుడు తేజ డైర‌క్ష‌న్లో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నారు వెంకీ..ఈ చిత్రాన్ని ఆయ‌న బ‌ర్త్ డే కి లాంచ్ చేయాలి అని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమా  ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ చివరి దశలో ఉందంటున్నాయి చిత్ర‌వ‌ర్గాలు.యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది..ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు.. కాని వెంకీ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ అనే పేరు వినిపిస్తోంది.

దీనికి ఒక కార‌ణం ఉంది అని తెలుస్తోంది.. డైర‌క్ట‌ర్ తేజ హీరోయిన్ కాజ‌ల్ ను ల‌క్ష్మీ క‌ల్యాణం సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం చేశారు.. అందుకే ఆమెకు తేజ అంటే ఎంతో ఇష్టం, ఆమె తేజ లాస్ట్ సినిమా నేనే రాజు నేనే మంత్రి కూడా అలానే క‌మిట్మెంట్ ఇచ్చార‌ట. ఇక ఇప్పుడు తాజా తేజ చిత్రంలో వెంక‌టేశ్ స‌ర‌స‌న ఆమెని ఫైన‌ల్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలుస్తోంది.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.