
‘గని’ రిలీజ్ డేట్
Saiee Manjrekar – Thaman : వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గని’. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు సినిమాను మార్చి 18, 2022న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘గని’. కరోనా ప్రభావం లేకుండా ఉండుంటే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎందుకనో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత.. సినిమాను శరవేగంగా పూర్తి చేసిన చిత్ర యూనిట్ ముందుగా అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంది. కానీ కుదరలేదు. దాంతో డిసెంబర్ తొలి వారంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ మళ్లీ వాయిదా వేస్తూ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, థియేటర్స్ సమస్య వస్తుందని గ్రహించి సినిమాను వాయిదా వేస్తున్నామని మళ్లీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గని చిత్రం ఏప్రిల్‌లో విడుదలవుతుందని కూడా వార్తలు వినిపించాయి.
కానీ చిత్ర యూనిట్ అలాంటి వార్తలకు చెక్ పెడుతూ గని సినిమాను మార్చి 18, 2022న విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ పెంచారు. బాక్సింగ్ ప్రొఫెషనల్‌గా కనిపించాలనే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లి మరీ ప్రత్యేకమైన శిక్షణను తీసుకున్నారు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేయడం విశేషం.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్