
Samantha Ruth Prabhu New Movie Yashoda Shoot Started
సమంత కొత్త సినిమా యశోద షూటింగ్ నేడు ప్రారంభమైంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. నేడు ఈ మూవీ షూటింగ్ మొదలైందని చిత్రయూనిట్ ప్రకటించారు.
సమంత ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయింది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2 సూపర్ హిట్ అవ్వడం, అందులో రాజీ పాత్రలో సమంత అదరగొట్టేయడంతో మంచి క్రేజ్ వచ్చింది. అలా సమంత ఇప్పుడు మళ్లీ ఆ స్థాయి ప్రాజెక్ట్‌ల్లోనే నటించాలని ఆశపడుతోంది. ఇంతకముందు అయితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచనల్లో ఉండటంతో బాలీవుడ్ ఆఫర్లను తిరస్కరించిందట. ఈ విషయాన్ని సమంత స్నేహితురాలు సాధన సింగ్, నీలిమ గుణ తెలిపారు. ఇక ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో సమంత తన ఫుల్ ఫోకస్‌ను సినిమాల మీదే పెట్టేసింది. సమంత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ఓకే చేస్తోంది. ఇక ఏకంగా హాలీవుడ్ చిత్రంలోనే సమంత నటిస్తోంది. ఓ బేబీ నిర్మాతతో మరోసారి సమంత జతకట్టేసింది. ఈ సారి హాలీవుడ్ స్థాయిలో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అంటూ రాబోతోన్న ఈ చిత్రంలో సమంత ఓ బై సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించబోతోందట.
ఇక అది అలా ఉంటే.. తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభమైంది. దసరా రోజు సమంత రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్డేట్లు వచ్చాయి. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా, డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్లో మరో చిత్రాన్ని సమంత ఓకే చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో వాటిని తమిళ, తెలుగు భాషల్లోనే తీయాలని భావించారు వాటిని కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే తెరకెక్కిస్తున్నారు. యశోద అంటూ సమంత కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. హరి నారాయణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోంది. ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్