
RRR సెకండ్ సాంగ్ రెడీ .. డిఫరెంట్ పోస్టర్ విడుదల చేసిన జక్కన్న…మెగా, నందమూరి అభిమానులకు కిక్కే కిక్కు
NTR – Ram Charan : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫిక్షనల్ పీరియాడికల్ మూవీ RRR. ఇందులో రెండో పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యింది. అక్టోబర్ 10న పక్కా మాస్ సాంగ్‌ను విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫిక్షనల్ పీరియాడికల్ మూవీ RRR వచ్చే ఏడాది సంక్రాంతి సందర్బంగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా.. టాలీవుడ్ టాప్ హీరోలు రామ్‌చరణ్, NTR సహా బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్.. హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ వంటివారు నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై అందరి దృష్టి నెలకొంది. పాన్ ఇండియా మూవీ కావడంతో జక్కన్న తనదైన రీతిలో ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసేశాడు. ఒక వైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో భాగంగా రీసెంట్‌గా 45 సెకన్ల ప్రోమోను విడుదల చేసిన రాజమౌళి అండ్ టీమ్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.
RRR నుంచి రెండో పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యింది. అక్టోబర్ 10న పక్కా మాస్ సాంగ్‌ను విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ తమ స్పెప్పులతో దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తుంది. నాటు నాటు.. అంటూ తెలుగులో, నాచో నాచో అంటూ హిందీలో, నాటు కుత్తు అంటూ తమిళంలో, హల్లి నాటు అంటూ కన్నడలో, కరిన్‌తోళ్ అంటూ మలయాళంలో సాగే ఈ పాట ఇటు నందమూరి అభిమానులు, అటు మెగాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడం ఖాయం. ఎందుకంటే, తమ అభిమాన హీరోలిద్దరూ సిల్వర్ స్క్రీన్‌పై చిందేయనున్న సాంగ్ ఇది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టరే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే RRR ఒక పీరియాడికల్ ఫిక్షనల్ మూవీ. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ అన్ని ఓ పీరియాడికల్ లుక్‌తో ఉన్నాయి. అయితే ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ మాత్రం చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఇందులో ఎన్టీర్, చరణ్ ఇద్దరూ స్టైలిష్ లుక్‌లో స్పెప్పులేస్తున్నారు. అదేంటో తెలియాలంటే మాత్రం అక్టోబర్ 10 వరకు ఆగాల్సిందే మరి.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్