
మునుపెన్నడూ చూడని విధంగా…..RRR Movie
ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ దీపావళి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి సంబంధించిన తాజాగా అప్డేట్ ఇచ్చారు. ప్రపంచంలో ఇది వరకు చూడనటువంటి కలయిక అని చెప్పుకొచ్చారు.
రాజమౌళి తెరకెక్కిస్తోన్నRRR మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలను వాయిదా వేస్తూ వచ్చింది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగేందుకు కర్చీప్ వేసేసింది. సంక్రాంతి సీజన్‌కు వారం ముందే వచ్చి బాక్సాఫీస్‌ను దున్నేద్దామని రాజమౌళి ప్లాన్ వేశాడు. అయితే ఇప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. గత రెండు మూడు రోజుల నుంచి ఆర్ఆర్ఆర్ మీద విపరీతమైన చర్చ నడుస్తోంది.
త్వరలోనే అదిరిపోయే అప్డేట్ రాబోతోందనే రూమర్లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. దీపావళి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ రాబోతోందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాదాపు ముప్పై నలభై సెకన్ల వీడియో రాబోతోందని, అందులో మాటలు ఉండవు అని కేవలం యాక్షన్స్, ఎమోషన్స్ మాత్రమే ఉంటాయనే టాక్ వచ్చింది .ఎందుకంటే మాటలు లేకపోతే అన్ని భాషలకు ఒకేలా రీచ్ అవుతుందనే స్ట్రాటజీని రాజమౌళి ఫాలో అవుతున్నాడట. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ దీనికి సంబంధించిన ట్వీట్ వేసింది. అదిరిపోయేలా అప్డేట్ ఇచ్చింది. ప్రపంచంలోని ఏ చిత్రంలోనూ ఇలాంటి కలయికను మీరు చూసి ఉండరు.. విని ఉండరు. అక్టోబర్ 29న చూసేందుకు రెడీగా ఉండండి.. ఇది అలాంటి ఓ అరుదైన కలయిక అవుతుంది.. ఆ రోజున ఇదే ట్విట్టర్ హ్యాండిల్‌లో అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉండండి అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఒక్క ట్వీట్‌తో నెట్టింటిని షేక్ చేసేశారు. మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలోRam-Charan-Ntr అభిమానులు సందడి చేయడం మొదలుపెట్టేశారు. ఎవరి అభిమానులు వారు తమ తమ హీరోల పేర్లను ట్విట్టర్‌లో మోత మోగిస్తున్నారు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్