Cinetollywood

లవ్‌స్టోరికి భారీ బుకింగ్స్

Love Story : నాగ చైతన్య, సాయి పల్లవిలు ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న “లవ్ స్టోరీ” ఇంకొన్ని గంటల్లో విడుదల కానుంది. మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకు అప్పుడే ఓ రేంజ్‌లో బుకింగ్స్ మొదలైయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాకు అమెరికాలో ఓ రేంజ్‌లో డిమాండ్ ఉందని తెలుస్తోంది.

(Naga Chaitanya)   (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలకానుంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి.

ఇక మరోవైపు ఈ సినిమా కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. సినిమాకి మొత్తం మీద 31.2 కోట్ల బిజినెస్ సొంతం అవ్వగా సినిమా ఇప్పుడు 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతోంది. ఇక ఈ సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే.. నైజాంలో 240 థియేటర్స్ లో విడుదలవుతోంది. ఆంధ్రలో 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాలలో లవ్ స్టోరి 640 థియేటర్స్ రిలీజ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 900 వరకు థియేటర్స్‌లో విడుదలకానుంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందు నుండే మొదలు అయ్యాయి.

హైదరాబాద్‌లో ఉన్న థియేటర్లలో మొదటి రోజు 245 షోలలో 85 షోలు బుకింగ్స్ అయ్యాయని తెలుస్తోంది. మహేష్ బాబు AMB సినిమాస్‌లో కూడా ఇప్పటికే 6,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీతో ముందుగానే థియేటర్లు ఫుల్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అదిరేపోయే ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఈ సినిమాకు అమెరికాలో కూడా భారీ బుకింగ్స్ అయ్యాయని అంటున్నారు. ఇప్పటికే అక్కడ రెండు లక్షల డాలర్స్ మార్క్ ను కూడా క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. దీనిని బట్టి లవ్ స్టోరీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. తాజాగా విడుదల అయిన ట్రైలర్ కి నెటిజన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ ఇప్పటి వరకు 6 మిలియన్ పైగా వ్యూస్‌తో అదరగొడుతోంది. లవ్ స్టోరీ ట్రైలర్ 24 గంటల్లో 342కే లైక్స్ ను సొంతం చేసుకుని టాప్ ఫైవ్ లైక్స్ వచ్చిన ట్రైలర్ లలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. వకీల్ సాబ్, బాహుబలి, సాహో, సరిలేరు నీకెవ్వరు సినిమాల తర్వాత లవ్ స్టోరీ ఎక్కువగా లైక్స్ పొందిన ట్రైలర్‌గా నిలిచింది.

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.