Cinetollywood

ఎంఎల్ఎ రివ్యూ 

MLA Movie Review and rating-Cinetollywood.com

!!  మంచి లక్షణాలున్న అబ్బాయ్ !! 

తారాగ‌ణం: కళ్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌, రవి కిషన్, 30 ఇయర్స్‌ పృథ్వీ, మనాలీ రాథోడ్‌

సంగీతం : మణిశర్మ

దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్‌

నిర్మాత : కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, టీజీ విశ్వ ప్రసాద్‌

నంద‌మూరి హీరోల సినిమాలు అంటేనే ఓ క్రేజ్ … నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం ఎంఎల్ఎ…ఇక ప‌టాస్ త‌ర్వాత త‌న‌కు మ‌రో స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు క‌ల్యాణ్ రామ్.. ఇక తాజాగా  విడుద‌ల చేసిన చిత్రం ఎంఎల్ ఎ.. కాజ‌ల్ తో లక్ష్మీక‌ళ్యాణంలో న‌టించి మళ్లీ ఇప్పుడు న‌టించాడు క‌ల్యాణ్ రామ్.. ఉపేంద్ర మాధ‌వ్ క‌థ న‌చ్చ‌డంతో పొలిటిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రం చేసి నేడు ఈ సినిమాను విడుదల చేశారు.. ఓ సారి ఉపేంద్ర మాధ‌వ్ క‌ల్యాణ్ రామ్ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ :

గాడప్ప (రవికిషన్‌) అనంతపురం జిల్లా వీరభద్రపురం ఎంఎల్‌ఎ. తరతరాలుగా గాడప్ప వంశం వాళ్లే అక్కడ ఎంఎల్‌ఎగా ఎన్నికవుతూ వస్తుంటారు. గాడప్పపై మీద ఒక్కసారైన విజయం సాధించాలన్న కసితో నాగప్ప(జయ ప్రకాష్ రెడ్డి) గాడప్ప మీద ఎన్నికల్లో తలపడుతూనే ఉంటాడు. ఇక మన హీరో కళ్యాణ్ (కళ్యాణ్ రామ్‌) మంచి లక్షణాలున్న అబ్బాయ్‌. చెల్లెలు(లాస్య) ప్రేమించిన అబ్బాయికి వేరే పెళ్లి జరుగుతుంటే పెళ్లి  పీటల మీదనుంచి లేపుకొచ్చి మరీ చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తాడు. 
తమకు కూడా చెప్పకుండా చెల్లి పెళ్లి చేసినందుకు కళ్యాణ్ తండ్రికి కోపం వస్తుంది. కళ్యాణ్‌తో సహా చెల్లిని కూడా ఇంట్లోనుంచి గెంటేస్తాడు. ఇక ఆతర్వాత  బెంగళూరు చేరిన కళ్యాణ్‌కు అక్కడ ఇందు(కాజల్) పరిచయం అవుతుంది. తొలిచూపులోనే ఇందుతో ప్రేమలో పడిన కళ్యాణ్ ఆమె కంపెనీ సమస్యల్లో ఉంటే బయటపడేసేందుకు సాయం చేస్తాడు. కానీ అదే సమయంలో ఇందు ప్రమాదంలో ఉందని తెలుస్తుంది. ఆమె గతం తెలుసుకున్న కళ్యాణ్ ఏం చేశాడు..? ఇందుకు వీరుభద్రపురం ఎంఎల్‌ఎ గాడప్పకు సంబంధం ఏంటి? కళ్యాణ్ ఎంఎల్‌ఎగా పోటి చేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి.? అన్నదే మిగతా కథ.
విశ్లేష‌ణ‌!! ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ న‌ట‌న‌కు 100 కి 100 మార్కులు వేయ‌వ‌చ్చు.. మంచి హిట్ కోసం చూస్తున్న క‌ల్యాణ్ రామ్ కు ఇది స‌క్సెస్ అనే చెప్పాలి.. కాజ‌ల్ కు మంచి న‌ట‌న చేసే  పాత్ర వ‌చ్చింది… ఆమె ఆ పాత్ర‌కు యాప్ట్ గా సెట్ అయింది అనే చెప్పాలి…. కాజ‌ల్ అందంతో పాటు అభిన‌యంతో మెప్పించింది..విలన్‌ గా రవికిషన్ తనకు అలవాటైన పాత్రలో కనిపించాడు..30 ఇయర్స్‌ పృథ్వీ,ప్రభాస్‌ శ్రీనులు నవ్వించే ప్రయత్నం చేశారు. వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
బ్రహ్మానందం కామెడీ వర్క్‌ అవుట్ అయ్యింది.  అలాగే దర్శకుడిగా తొలి ప్రయత్నానికి ఉపేంద్ర మాధవ్‌ పక్కా ఫార్ములా కమర్షియల్ సినిమాను ఎంచుకున్నాడు. మణిశ‌ర్మ సంగీతం బాగుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.. ఎడిటింగ్ బాగుంది… ఫ‌స్టాప్ కంటే సెకండాఫ్ లో సినిమా స్టోరీలోకి వెళ్లేలా క‌థ‌ను రాసుకున్నారు… ఎమ్మెల్యేగా ప్రయ‌త్నం చేయ‌డం ఎలివేట్ చేసే స‌న్నివేశాలు బాగున్నాయి.. మొత్తానికి నంద‌మూరి అభిమానుల‌కు క‌ల్యాణ్ రామ్ మ‌రో గుడ్ మూవీ అందించాడు, అన‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తిలేదు..మూడు ఫైట్లు ఆరు పాట‌ల‌తో సినిమా అల‌రిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :

కళ్యాణ్ రామ్‌, కాజల్ ఎంపిక‌

కామెడీ 

నేపథ్య సంగీతం

కొన్ని కొన్ని స‌న్నివేశాలు అద్బుతంగా రాయ‌డం 
మైనస్ పాయింట్స్ :

ఫ‌స్టాఫ్ పై  అనుకున్నంత శ్ర‌ద్ద పెట్ట‌క‌పోవ‌డం 

రోటీన్ క‌థ కాస్త మార్పులు
మొత్తానికి మంచి ల‌క్ష‌ణాలు ఉన్న అబ్బాయి అని ప్రేక్షకులు కచ్చితంగా అంటారు 
రేటింగ్ 3

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.