Cinetollywood

‘మా’ అధ్యక్షులు మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..హీరోయిన్లపై అలా చేస్తే సహించం.. హద్దు మీరితే..!

కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టి వీక్షకులను తప్పుదోవ పట్టించడమే గాక.. నటీనటులను లేనిపోని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ‘మా’ అధ్యక్షులు మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు.


దినదినం సోషల్ మీడియా నెట్ వర్క్ పరిధి పెరుగుతూ వస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుండటంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో హావా నడిపిస్తున్నారు. ఇక అదే సోషల్ మీడియాలో యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ డబ్బు సంపాదనకు అవకాశం ఇవ్వడంతో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్ వెలుస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని ఛానల్స్ మాత్రం తప్పుడు 
థంబ్‌నైల్స్‌  పెట్టి వీక్షకులను తప్పుదోవ పట్టించడమే గాక.. నటీనటులను లేనిపోని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ‘మా’ అధ్యక్షులు మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు.

తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు.. హీరోయిన్ల విషయంలో అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని అన్నారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని చెప్పిన విష్ణు అలాంటి వారిని వెతికి పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూట్యూబ్‌ ఛానళ్ల థంబ్‌నైల్స్‌ హద్దులు మీరుతున్నాయని, అలా అసభ్యకరంగా వ్యవహరించే యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తప్పవని మంచు విష్ణు చెప్పారు. హీరోయిన్స్ అంటే మన ఆడపడుచలని, వారిని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.