Cinetollywood

బన్నీ లవ్ మ్యారేజ్ పై అరవింద్ ఆసక్తికర కామెంట్లు

Intresting updates on Allu arjun and sneha reddy love secrete reveal Allu Arvind

టాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ అంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఈ జంట అని చెబుతారు.. అయితే వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు వర్గాల పెద్దల ఆశీర్వాదంతో 2011 మార్చి 6వ తేదిన ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. వీరికి అల్లు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి వివాహం అయి తొమ్మిది సంవత్సరాలు అవుతోంది.

వీరిద్దరి పెళ్లి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు బన్నీ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ఆయన సతీమణి నిర్మల…. బన్నీ స్నేహను ప్రేమించిన విషయం ఆమెని పెళ్లి చేసుకుంటాను అని ముందుగా తన తల్లి నిర్మలతో చెప్పారట.

నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పిందట బన్నీ తల్లి నిర్మల . ఇక ఆ తరవాత అరవింద్‌కు చెప్పగా.. స్నేహ తల్లిదండ్రులను వచ్చి మాట్లాడమని చెప్పారట. ఇలా ఐదు నిమిషాల్లోనే బన్నీ ప్రేమకు, వివాహానికి అల్లు ఫ్యామిలీలో గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. మొత్తానికి ఇప్పుడు బన్నీ టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్నారు, అయితే ఆయన సినిమాల్లో ఒక్కో మెట్టు ఎక్కి సినిమా సినిమాకి తన నటన స్టైల్ తో ఎలా ఆకట్టుకుంటారో ప్రతీ ఒక్కరికి తెలిసిందే.. ఇక రామ్ చరణ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.