
‘పుష్ప’ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్… అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ
Allu Arjun – Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ సమాచారం మేరకు…
ఐకాన్ స్టార్ Allu Arjun హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా తొలి భాగం ‘Pushpa ది రైజ్’ను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో దాదాపు మూడు పాటల చిత్రీకరణను మాత్రం పూర్తి చేయాల్సి ఉంది. విదేశాల్లో ఈ పాటలను పూర్తి చేసేలా ప్లాన్ చేశారట డైరెక్టర్ సుక్కు. నవంబర్ ద్వితీయార్థానికంతా షూటింగ్ పూర్తి చేసేలా సన్నాహాలు చేసుకున్నారట.
పాన్ ఇండియా మూవీ కావడంతో దానికి తగ్గట్టు ప్రమోషన్స్ ప్లాన్ చేసుకోవాలి మరి. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. రంగ స్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా కావడంతో సినీ వర్గాలు ఆసక్తిగా పుష్ప ది రైజ్ కోసం వేచి చూస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో పుష్ప మూవీ తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ రగ్డ్ లుక్లో కనిపించే పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్