
అవన్నీ తెలియదన్న డైరెక్టర్…Radhe Shyam విడుదలపై క్లారిటీ
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు విధించారు. దీంతో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్‌లు వాయిదా వేస్తున్నారంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. వాటిపై రాధా కృష్ణ కుమార్ స్పందించాడు.
ప్రభాస్ రాధే శ్యామ్ ట్రైలర్ క్రియేట్ చేసిన సంచలనాలు అంతా ఇంత కాదు. దెబ్బకు యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. తన పేరు మీదున్న బాహుబలి 2 రికార్డులను ప్రభాసే చెరిపేశాడు. అయితే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలపై ఇప్పుడు కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. అసలే ఒమిక్రాన్ భయం ఎక్కువవుతోంది. ఇక మహారాష్ట్రలో అయితే ఏకంగా ఆంక్షలు విధించారు. నైట్ కర్ఫ్యూను పెట్టేశారు. థియేటర్లో యాభై శాతానికి ఆక్యుపెన్సీని తగ్గించారు. అయితే ఈ దెబ్బతో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్‌లు వాయిదా వేస్తున్నారంటూ రూమర్లు బయటకు వచ్చాయి. మహారాష్ట్ర మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలో మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఇంకా మున్ముందు మరిన్ని ఆంక్షలు అమలు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
అసలే ప్యాన్ ఇండియన్ సినిమాలు.. ఉత్తర భారతదేశం కలెక్షన్ల మీద మన వాళ్లు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇలాంటి సమయంలో కర్ఫ్యూలు, యాభై శాతం ఆక్యుపెన్సీ చేయడంతో పెద్ద దెబ్బ పడ్డట్టు అయింది. అయితే ఈ వాయిదా రూమర్ల మీద రాధా కృష్ణ కుమర్ స్పందించాడు. ఒమిక్రాన్ వల్ల సినిమాను వాయిదా వేస్తున్నారట కద? అని మీడియా ప్రశ్నిస్తే.. రాధాకృష్ణ ఆసక్తికరమైన సమాధానాన్ని చెప్పాడు. తనకు సినిమాను పూర్తి చేసి నిర్మాతలకు ఇవ్వడమే తెలుసు.. ఈ ఒమిక్రాన్ గురించి నాకు తెలీదు.. ఇప్పటి వరకైతే జనవరి 14న రాధే శ్యామ్ రాబోతోంది.. ఈ సినిమానే విల్ పవర్ మీద ఉంటుంది.. మన విల్ పవర్ ఎంత ఉంది? అనేది చూడాలంటూ చెప్పుకొచ్చాడు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్