Cinetollywood

జనసేనానికి మాతృమూర్తి నాలుగు లక్షల విరాళం

Anjanadevi donate four lakhs fund for Janasena party

జనసేనాని అధినేత పవన్ కల్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి జనసేన పార్టీ అధినేతని కలిశారు.. ఆయనతో కాసేపు ముచ్చటించారు. పార్టీ గురించి ఆమె జనసేనానిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో పార్టీకి తన తరపున నాలుగు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు ఆమె. ఈ నేపథ్యంలో తన తల్లి పాదాలను మొక్కిన పవన్, ఆమె దగ్గర నుంచి ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం తన తల్లితో కాసేపు ముచ్చటించిన పవన్.. దగ్గరుండి ఆమెను ఇంటికి పంపారు.

ఇక కార్యాలయానికి వస్తున్నారు అని తెలియగానే పవన్ ఎంతో ఆనందపడ్డారు. స్వయంగా ఆమె పార్టీ కార్యాలయానికి వచ్చి చెక్కు ఇవ్వడంతో అక్కడ ఉన్న వారు అందరూ ఆశ్చర్యపోయారు.. రాజకీయంగా ఆయన బిజీగా ఉండటం వల్ల ఇటీవల తల్లిని కలవలేకపోయారు పవన్. నేడు ఆమె స్వయంగా కార్యాలయానికి రావడంతో ఆశీస్సులు తీసుకుని ఉబ్బితబ్బిబయ్యారు. నువ్వు రాజకీయంగా మంచి ప్రయోజకుడివి అవ్వాలి అని పవన్ ని ఆమె ఆశీర్వదించారు.

Gallery

Latest Updates

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.