Cinetollywood

రష్మిక మందన్న,అల్లు అర్జున్.. ‘పుష్ప’ సెన్సార్ పూర్తి

Allu Arjun – Pushpa Censor Completed | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

Allu Arjun – Pushpa Censor Completed (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌పై తాజాగా అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.అంతేకాదు దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇక మరోవైపు ఈ సినిమా తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

దీంతో ఇన్నాళ్లు తన కోసం తన సినిమా కోసం కష్ట పడిన చిత్రబృందానికి అల్లు అర్జున్ డజను మంది ముఖ్య సభ్యులకు ఒక్కొక్కరికి 10 గ్రాముల చొప్పున బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో టీమ్ అల్లు అర్జున్ మనస్సుకు ఫిదా అయ్యారట. బన్ని మనస్సు గొప్పదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారట.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.