
ఈవెంట్‌కి ముందు జరిగింది బయటపెట్టిన అల్లు అర్జున్
ఆదివారం రాత్రి ‘పుష్ప’ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడిన తీరు అభిమానులను హుషారెత్తించింది. ఈవెంట్‌కి ముందు సుకుమార్‌తో జరిగిన సంభాషణను ఆయన బయటపెట్టారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన భారీ సినిమా ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేస్తున్న నేపథ్యంలో నిన్న (ఆదివారం) రాత్రి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు రాజమౌళి సహా ‘పుష్ప’ యూనిట్ అంతా హాజరు కాగా.. డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అటెండ్ కాలేకపోయారు. దీంతో వేదికపైకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ఇద్దరినీ గుర్తు చేసుకున్నారు. అయితే వేదికపై మాట్లాడిన అల్లు అర్జున్ ఈవెంట్‌కి ముందు సుకుమార్‌తో జరిగిన సంభషణ తాలుకు వివరాలు బయటపెట్టారు.
”సుకుమార్ గారు ఈ ఫంక్షన్‌కు రావడం లేదు అని నాకు సాయంత్రం చెప్పారు. ఆ మాట విని నేను షాకయ్యా. సుకుమార్ లేకుండా ఫంక్షన్ జరగడం ఏంటి? అని వెంటనే ఫోన్ చేశా. ప్రైవేట్ జెట్ కూడా పెడతాను. వెంటనే నువ్వు వచ్చేయాలి అని అన్నా. ఆయన తప్పకుండా వస్తారని చాలా కాన్ఫిడెంట్‌గా అన్నా. కానీ సుకుమార్ మాత్రం చాలా సింపుల్‌గా తాను రావడం లేదని నన్ను కన్విన్స్ చేశారు. ఫైనల్‌గా అడిగితే సుకుమార్ గారు ఒక మాట చెప్పారు. డార్లింగ్ నువ్వు వెళ్ళు.. ప్రాడక్ట్ బాగా వచ్చే వరకు ఆఖరి నిమిషం వరకు కూడా తగ్గేదే లే అని చెప్పి.. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని గట్టిగా చెప్పు అని అన్నారు. ఇలా చివరి నిమిషం వరకు సినిమా కోసం కష్టపడుతున్న సుకుమార్ గారికి, దేవీ శ్రీ ప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
సినిమా చేస్తుంటే సుకుమార్ ఇంకో మాట కూడా చెప్పారు. ఇక్కడ నువ్వు నేను కాదు. ఇది మనం. రేపు నీకు మంచి పేరు వచ్చినా, నాకు మంచి పేరు వచ్చినా అది మనకే దక్కుతుంది అన్నారు. కాబట్టి ఏ క్రెడిట్ వచ్చినా అది మాది అంతే. ఆ కాన్ఫిడెన్స్ తోనే సినిమా చేశాను. డిసెంబర్ 17న మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో వరల్డ్ వైడ్ గా పుష్పరాజ్ విడుదలవుతోంది. ఇంతకంటే పెద్ద పార్టీ మరోటి ఏముంటుంది” అన్నారు అల్లు అర్జున్.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్