
పూర్ణ ప్రధాన పాత్ర లో నటించిన “బ్యాక్ డోర్” సినిమా రివ్యూ
తారాగణం :పూర్ణ, తేజ త్రిపురణ
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ :ఆర్చిడ్ ఫిలిమ్స్
డైరెక్టర్ :కర్రీ బాలాజీ
ప్రొడ్యూసర్ :శ్రీనివాస రెడ్డి బి
సినిమా ఆటోగ్రఫేర్ :శ్రీకాంత్ నరోజ్
ఎడిటర్ :చోట కే ప్రసాద్
మ్యూజిక్ :ప్రణవ్
తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కేరళ అమ్మాయి పూర్ణ.. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు మంచి కమర్షియల్ చిత్రాల్లోనూ ప్రతిభ వున్న తారగా మెప్పించింది. పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా బ్యాక్ డోర్. సినిమా టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇదేదో యూత్ ఫుల్ కాన్సెప్ట్ గా కనిపించడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి ఈ ‘బ్యాక్ డోర్’ సినిమాను నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ..
సక్సెస్ ఫుల్ బిజినెస్ పర్సన్ భార్య అంజలి (పూర్ణ). ఇద్దరు పిల్లలున్న తల్లి. భర్త, పిల్లలు, ఇళ్లు ఇదే ఆమె ప్రపంచం. భర్త ఆఫీస్ కు, పిల్లలు స్కూల్ కు వెళ్లాక గానీ అంజలి ఫ్రీ అవదు. వివాహ వేడుకలో అరుణ్ (తేజ త్రిపురాన) అంజలికి పరిచయం అవుతాడు. వీళ్ల ఇద్దరి మధ్య మాటలు కలుస్తాయి. అరుణ్ ఫ్రెండ్లీ నేచర్, సరదా మాటలు అంజలికి బాగా నచ్చుతాయి. పెళ్లై పిల్లలున్నా అంజలి అందం తరగనిది. అంజలి సౌందర్యానికి అరుణ్ ఆకర్షితుడు అవుతాడు. పెళ్లి వేడుకలో కలిసినప్పటి నుంచి అంజలి, అరుణ్ ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ, మెసేజ్ లు పంపుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అరుణ్ ను ఇంటికి పిలుస్తుంది అంజలి. వీలైనంత త్వరగా ఆమె అందాన్ని పొందాలని చూస్తాడు అరుణ్. అంజలి మనసు అరుణ్ ను వ్యతిరేకిస్తుంది. ఆ హద్దు దాటనీయకుండా అడ్డుపడుతుంది. ఆ సమయంలో ఏ జరిగింది. ఈ బలహీన క్షణాల్లో అంజలి అరుణ్ ను ఆపగలిగిందా, లేదా అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
బ్యాక్ డోర్ సినిమా ని అంత పూర్ణ తన భుజాలు మీద నడిపించింది అని చెప్పాలి . గృహిణి అయినా అంజలి పాత్రలో హుందాగా ఒదిగి పోయింది , భావోద్వేగాలతో స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కరించింది. హద్దులు దాటమనే వయసుకు, తప్పని చెప్పే మనసుకు మధ్య నలిగే హౌస్ వైఫ్ గా తన నటనలో అద్భుతమైన హావభావాలు చూపించింది. అంజలి క్యారెక్టర్ లో ప్రతి ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అరుణ్ క్యారెక్టర్ లో తేజ ఉత్సాహంగా నటించాడు. సగటు యువకుడి తీరు అతని నటనలో చూపించాడు. పూర్తి కమర్షియల్ పంధాలో సినిమా చూపిస్తూ..చివరలో మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఇంత మెసేజ్ కలిగిన సినిమా చేసిన నిర్మాత బి శ్రీనివాస రెడ్డికి మంచి అభిరుచి ఉందని చెప్పుకోవాలి. యువతకు ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడకుండా చక్కటి సినిమాను నిర్మించారు నిర్మాత బి శ్రీనివాస రెడ్డి.
బ్యాక్ డోర్ సినిమాలో సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి టెక్నికల్ అంశాలు చాలా బలంగా ఉన్నాయి. అంజలి, అరుణ్ కలిసే ఇంటిమేట్ సీన్స్ ను సినిమాటోగ్రఫర్ శ్రీకాంత్ నారోజ్ బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. పాటల్లో యుగాల భారత స్త్రీని పాట అంతర్మథనంతో సాగితే, రారా నన్ను పట్టేసుకుని మంచి రొమాంటిక్ సాంగ్ గా ఆకట్టుకుంది. సినిమా మరీ విచ్చలవిడిగా లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన సినిమా కావడంతో యూత్ ఫుల్ అంశాలను దట్టించలేదు. ఇప్పుడున్న పరిస్థితులు లో ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి చూడటానికి బ్యాక్ డోర్ సినిమా చాలా చక్కటి ఆప్షన్ అని చెప్పాలి.
రేటింగ్ 3.25/5