Cinetollywood

కేంద్ర‌మంత్రికి వైసీపీ సూచ‌న‌లు

YSRCP references to the Union Minister

దేశంలో కేంద్ర‌ప్ర‌భుత్వం  బీజేపీ అధికారంలోకి వ‌చ్చి మూడు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోతోంది… ఇక ఏపీకి ఆ నాడు యూపీఏ ఇచ్చిన విభ‌జ‌న హామీలు,  ఇచ్చిన ప‌లు కీల‌క స‌హాయాలు బిల్లులో తెలిపిన కొన్ని హామీలకు తిలోద‌ల‌కాలు వ‌దిలింది కేంద్రం.. ముఖ్యంగా మోదీ స‌ర్కార్  ఏపీకి ఇచ్చిన ప‌లు హామీలు  నెర‌వేర్చుతారు అని అంద‌రూ భావించారు, నాడు మోడీ మాట‌లు విశ్వ‌సించి ఓట్లు కూడా వేశారు ఏపీ ప్ర‌జ‌లు… అయితే ఇప్పుడు దేశంలో విజ‌య‌బాహుటా ఎగుర‌వేస్తున్న మోదీ, త‌న‌కంటూ తిరుగులేద‌ని రాజ‌కీయంగా దూసుకుపోతూ మిగిలిన రాష్ట్రాల‌ను కూడా క‌మ‌లం విక‌సించేలా చేయాలి అని చూస్తున్నారు.

 
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. పలువురు నేతలతో కలిసి ఆయన ఆర్థికమంత్రిని  కలిశారు. త్వరలో బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్‌ సూచనల సమావేశంలో పాల్గొన్న సుబ్బారెడ్డి ఏపీకి చేయాల్సిన కేటాయింపులపై, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున కేంద్ర‌మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అందులో ఆయన ఏపీకి డిమాండ్  చేసిన అంశాలు చూస్తే?

1. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా క‌ల్పించాలి

2. ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

3.  కేంద్రం పోలవరాన్ని వెంటనే పూర్తి చేయడం. అందుకు కావాల్సిన నిధుల విడుదల

4. విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్ ప్ర‌క‌ట‌న‌

5. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయనున్న ఐఐఐటీ, ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ఎయిమ్స్‌కు కావాల్సిన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించడం

6. ఏపీ రాజ‌ధాని అమరావతికి ఆర్థిక సాయం

7. వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు ఆర్థిక సాయం చెయ్యాలి అని విన‌తి ప‌త్రంలో కోరారు.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.