జ‌న‌నేత పార్టీకి 8 ఏళ్లు?

YSRCP celebrating 8 anniversary day

ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి… ప్ర‌జా జీవితంలో భాగ‌మై ప్ర‌జ‌లే త‌న ఆస్దిగా ముందుకు వెళుతున్న నాయ‌కుడు.. ఆయ‌నే వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. రాజ‌న్న లేని లోటును  తీరుస్తున్న ప్ర‌జాబాంధ‌వుడు. ప్ర‌జ‌ల కోసం అన్ని వ‌దిలి ప్ర‌జాక్షేత్రంలోకి వ‌చ్చిన నాయ‌కుడు. ఎన్ని కుతంత్రాలు ఎదురైనా తండ్రి లేని స‌మ‌యంలో రాబందుల్లా పీక్కుతీనే ఆలోచ‌న‌ల‌తో ఇరికించాలి అని చూసినా?  శ‌కుని లాంటి కుతంత్ర రాజ‌కీయ నాయ‌కుల కబంధ హ‌స్తాల నుంచి బ‌య‌ట‌ప‌డుతున్న వ్య‌క్తి  వైసీపీ అధినేత జ‌గ‌న్ అని చెప్పాలి.
    

ప్ర‌జా సంక్షేమ‌మే ఊపిరిగా ఆయ‌న పోరాటాలు స్పూర్తిదాయం అనే చెప్పాలి…అప్రతిహతంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌తో ప్రజ‌ల మ‌ధ్య‌న ఉన్నారు.. నేడు వైసీపీ ఎనిమిదోవ ప‌డిలోకి అడుగుపెట్టింది. 
విశ్లేష‌ణాత్మక క‌థ‌నం 

తెలుగు ప్రజల కోరిక మేర‌కు చ‌రిత్ర‌లో ఒక అధ్యాయం లిఖించే దిశ‌గా  ఒక చారిత్రక అవసరంగా 2010 మార్చి 12న ఆవిర్భవించిన  పార్టీ  వైయ‌స్సార్ సీపీ…మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత సంక్షోభాలు రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న తరుణంలో పుట్టిన పార్టీని మొగ్గలోనే తుంచేయాలని వ్యతిరేక శక్తులు చేసిన కుట్రలేవీ ఫలించలేదు. 

 

జ‌గ‌న్ త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో ముందుకు వెళ్లారు అనే చెప్పాలి. కేవ‌లం జ‌గ‌న్ ఆయ‌న మాతృమూర్తి విజ‌య‌మ్మ మాత్రమే తోడుగా పార్టీలో ఆదిలో ఉంటే, నేడు పార్టీకి కోట్లాదిమంది అభిమానులు, ల‌క్ష‌లాది మంది సైన్యం,. వంద‌లాది మంది కీల‌క నాయ‌కులు తోడుగా ఉన్నారు.

 
జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే, కేసులతో చుట్టిముట్టి రాజ‌కీయంగా ఇరికించారు ఇటు కాంగ్రెస్ నాయ‌కులు అలాగే తెలుగుదేశం నాయ‌కులు…..2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలు , 2 ఎంపీ స్థానాలను గెల్చుకుంది. పార్టీ ఆరంభంలోనే జరిగిన కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 5,45,672 ఓట్లు, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తల్లి విజయమ్మ 81,373 ఓట్ల భారీ ఆధిక్యంతో ఎన్నికై యావత్‌ దేశంలోనే మరపురాని ఒక చరిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు.  

 

    త‌ర్వాత ఉప ఎన్నిక‌ల్లో 15 ఎమ్మెల్యే స్ధానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక ఆ ఎన్నిక‌ల్లో నెల్లూరు ఎంపీ స్ధానాన్ని కూడా సాధించుకుంది వైసీపీ… జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ ను ఎలాగైనా ఓడించాలి అని తెలుగుదేశం అనేక హామీల‌ను ఇచ్చి ఎన్నిక‌ల్లోకి వెళ్లింది… అయినా బీజేపీ తెలుగుదేశం జ‌న‌సేన కూట‌మిని ఎదిరించి స్వ‌ల్ప‌తేడాతో విజ‌యానికి దూరం అయ్యారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.67 సీట్లతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. 

 

ఇక పార్టీని ఎలాగైనా నిర్విర్యం చేయాలి అనే త‌లంపుతో పార్టీ పై దుష్ట‌ప‌న్నాగాలు ప‌న్నారు జ‌గ‌న్ పై కేసుల గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావించి పార్టీని క‌నిపించ‌కుండా చేయాలి అని త‌లిచారు.. అలాగే వైసీపీ ఎమ్మెల్యేల‌కు ప్ర‌లోభాల‌కు గురిచేసి పార్టీ నుంచి తెలుగుదేశంలోకి చేర్చుకున్నారు.. 23 మంది ఎమ్మెల్యేల‌ను ముగ్గురు ఎంపీల‌ను పార్టీ మారేలా చేశారు తెలుగుదేశం నాయ‌కులు. 

 
అయినా జ‌గ‌న్ వారి రాజీనామాలు చేయాలి అని ప్ర‌శ్నిస్తూ ముందుకు వెళుతున్నారు.. అలాగే పార్టీ నుంచి వెళ్లిన వారికి రాజ్యాంగాన్ని అప‌హాస్యంచేస్తూ న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.. దీనిపై తెలుగుదేశాన్ని రోజూ ప్ర‌శ్నిస్తూనే ఉంటారు వైసీపీ అధినేత జ‌గ‌న్. ఇక ప్లీన‌రీ వేదిక‌గా  పాద‌యాత్ర‌కు పిలుపునిచ్చారు జ‌గ‌న్.. రైతుదీక్ష యువ‌భేరి నిర్వ‌హించి ప్ర‌జ‌ల్లో చైతన్యం తీసుకువ‌చ్చారు.. ప్ర‌త్యేక హూదా పై ఒకే మాట‌తో ముందుకు వెళ్లారు వైసీపీ అధినేత జ‌గ‌న్. మ‌రో ఏడాదిలో  జ‌రిగే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించాలి అనే త‌లంపుతో పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఉన్నారు. అలాగే జ‌గ‌న్ పాద‌యాత్ర ప్ర‌జ‌ల్లో మ‌రింత చైత‌న్యం తీసుకువ‌చ్చింది. 

 

మార్పు కోసం జ‌గ‌న్  రావాలి ….ఏపీ అభివృద్ది  కోసం వైసీపీ అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు ప్ర‌జ‌లు .

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.