
కోర్టుకు వైసీపీ ఆ ఇద్దరు టీడీపీ నేతలకు కొత్త భయం
ఈసారి వచ్చిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం వైసీపీ స్టేట్ క్లీన్ స్వీప్ చేస్తుందా అనే ఆశ్చర్యం కూడా కలిగింది ఫలితాలు విడుదల అవుతున్న సమయంలో, అయితే 151 స్ధానాలతో వైసీపీ రేసు ఆగిపోయింది. ఇక తెలుగుదేశం ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడే ఆగిపోయింది ఆ23 మంది ఎమ్మెల్యే సభ్యులు మాత్రమే మిగిలారు. ఇక వైసీపీ ఇప్పుడు వచ్చిన ఫలితాలలో ఒక ఇద్దరి ఫలితాలపై మాత్రం ఇంకా విమర్శలు చేస్తోంది. ఆరోపణల పరం పర కొనసాగుతోంది అని చెప్పాలి.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఖాతాలో పడిన గుంటూరు.. శ్రీకాకుళం ఎంపీ స్థానాలు రెండింటిలోనూ తామే గెలిచామన్న భావనను ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. ఓట్ల లెక్కింపు విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్.. ఈ విషయంపై న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఇది వైసీపీ శ్రేణులకు ఆనందం కలిగిస్తుంటే తెలుగుదేశం నేతలకు మాత్రం మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు అయింది. ఇక వైసీపీ పిటిషన్ వేసేందుకు సిద్దం అవుతోంది. జగన్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.. గుంటూరు నుంచి వైసీపీ తరపున ఎంపీగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నిలబడ్డారు, ఇక శ్రీకాకుళం నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఎంపీగా నిలబడ్డారు. వీరి ఫలితాల పై ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో రిటర్నింగ్ అధికారులు సరిగా వ్యవహరించలేదని.. సర్వీసు ఓట్లలో ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వచ్చాయని జగన్ దృష్టికి అభ్యర్థులు తీసుకెళ్లారు. గుంటూరులో టీడీపీ అభ్యర్థి సుమారు 4 వేల మెజార్టీతో విజయం సాధించినట్లుగా ప్రకటించారు. అయితే సర్వీసు ఓట్లను సరిగా లెక్కిస్తే కచ్చితంగా తాము గెలుస్తామని చెబుతున్నారు.. దాదాపుగా 9 వేల ఓట్ల వరకూ వచ్చాయని, మరి వాటి విషయంలో తాము చేసిన వినతుల్ని ఎన్నికల అధికారులు అంగీకరించలేదన్నారు. ఇది వైసీపీ తరపున గుంటూరు అభ్యర్ది వాదన. ఇక శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడికి ఆరు వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది, ఇక్కడ కూడా ఇలాంటిది జరిగింది అని చెబుతున్నారు దువ్వాడ శ్రీను ,సో దీనిపై కోర్టులో పిల్ వేయాలి అని భావిస్తున్నారు. మరి కోర్టులో ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.. ఇక గెలిచాము అని ఆనందంలో ఉన్న ఇద్దరు తెలుగుదేశం నేతలకు ఇప్పుడు ఇదే కొత్త భయం పట్టుకుంది.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్