Cinetollywood

జ‌గ‌న్ ముందు అడుగు బాబు వెన‌క‌డుగు

YS jagan one step forward but Chandrababu one step back

దేశంలో తానే సీనియ‌ర్… ఇన్ రాజ‌కీయాలు వాట్ అయామ్ సేయింగ్… ప్ర‌ధాని ప‌ద‌వి వ‌ద్దు అనుకున్నా అంటారు.. ఏపీ ప్ర‌జ‌ల సంక్షేమం ముఖ్యం అంటారు తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు. విజ‌న్ 20-20- అంటారు హైద‌రాబాద్ తానే నిర్మించా అంటారు.. సో ఎవ‌రు ఏమి నిర్మించినా ఎవ‌రు న‌మ్మాలి అన్నా? అమ‌రావ‌తిలో ఓ అడుగు ముందుకు అభివృద్ది జ‌రుగ‌లేదు ఆ స‌చివాల‌యం అసెంబ్లీ మిన‌హా ఒక్క ఇటుక కూడా ముందుకు ప‌డ‌లేదు.

 

 

అయితే ప్ర‌త్యేక హూదా వ‌ల్ల ఏపీకి ఏమి వ‌స్తుంది?  ప్యాకేజీ బెట‌ర్ అని కేంద్రం ప్ర‌క‌ట‌న‌కు ప్యాకేజీకి అర్ధ‌రాత్రి మీడియా ముఖంగా రాజ‌ముద్ర వేశారు బాబు.. త‌ర్వాత జ‌గ‌న్ తీసుకున్న స్టాండ్ మాత్రం మార‌డం లేదు.. ఎప్పుడూ ప్ర‌త్యేక హూదాకి సై అంటున్నారు ఇటు ప్ర‌త్యేక ప్యాకేజీకి వైసీపీ ఎప్పుడూ దూరం అనే చెప్పాలి.

 

 

ఇక  జ‌గ‌న్ మొద‌టి నుంచి అదే మాట పై ఉండ‌టం, ఏపీలో ప్ర‌త్యేక హూదా గురించి ఫైట్ స్టార్ట్ అవ‌డంతో వెంటనే కేంద్రం చెప్పిన‌ ప్ర‌త్యేక ప్యాకేజీవ‌ద్దు, ప్ర‌త్యేక హూదా ఇవ్వాలి అని అంటున్నారు.. ఇక మంత్రులుగా తన ఇద్ద‌రు ఎంపీల‌ను కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి రాజీనామా చేయించారు.. ఇక 2014 నుంచి జ‌గ‌న్ చంద్ర‌బాబు ప్ర‌త్యేక హూదా కోసం ఎటువంటి అడుగులు ముందుకు వేశారు, ఎవ‌రు వెన‌క‌డుగులు వేశారో ఇప్ప‌డు చూద్దాం. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌గన్ ప్ర‌త్యేక హూదా పైనే ఉన్నారు దాని నుంచి ఆయ‌న వెన‌క్కి రాలేదు అని చెప్పాలి.

 

12.06.2014:  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రాష్ట్రానికి 20 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

 
05.12.2014:  ప్రత్యేక హోదా సాధించని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్‌సీపీ ధర్నాలు చేసింది  విశాఖలో జ‌గ‌న్ పాల్గొన్నారు.

 
16.02.2015:  లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఏపీకి తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించాలని పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి డిమాండ్  చేశారు.

 
03.06.2015: ఏడాది గడిచినా సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదని వైఎస్‌ జగన్‌  రెండు రోజుల పాటు మంగళగిరిలో సమర దీక్ష చేపట్టారు. బాబు పాలనపై ప్రజా బ్యాలట్‌ నిర్వహించారు.

 
15.06.2015: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి వైఎస్‌ జగన్‌ వినతి పత్రం అందించారు.    

 
10.08.2015: ఢిల్లీలో జగన్‌  నేతృత్వంలో ఒకరోజు ధర్నా చేప‌ట్టారు. 

 
29.08.2015: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పిలుపు మేరకు సంపూర్ణంగా రాష్ట్ర బంద్ జ‌రిగింది.

 
07.10.2015: గుంటూరులో ఏడు రోజుల దీక్ష … ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ 07 నుంచి 13 వరకు  జగన్‌ నిరవధిక నిరాహార దీక్ష. ప్రధాని మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఆకాంక్ష  ఎంత బలీయంగా ఉందో చాటి చెప్పడానికి దీక్ష చేపడితే ప్రభుత్వం పోలీసుల ద్వారా భగ్నం చేసింది. మోదీ వ‌ర‌కూ వెళ్ల‌కుండా టీడీపీ అడ్డుకుంది.  

 
17.10.2015: జగన్‌  పిలుపుతో మూడు రోజుల పాటు (17 నుంచి 21 వరకు) పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు   చేప‌ట్టారు

 
10.05.2016: కలెక్టరేట్ల వద్ద ధర్నా… రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ధర్నా నిర్వ‌హించింది.. కాకినాడ ధర్నాలో జగన్‌ పాల్గొన్నారు.  

 
21.07.2016: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ఏపీకి ప్రత్యేక హోదా బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చింది.

   

23.07.2016:  ఆంధ్రప్రదేశ్‌కు 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరుతూ పార్లమెంట్‌లో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రైవేట్‌ బిల్లు ప్రతిపాదించారు.  

 
29.07.2016: ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానం చెప్పారు, టీడీపీ, బీజేపీ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.    

 
02.08.2016: ప్రత్యేక హోదాకు మద్దతుగా రాష్ట్ర బంద్ పిలుపునిచ్చింది వైసీపీ 
08.08.2016: ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి జగన్, పార్టీ ఎంపీలు వినతిపత్రం  అందించారు

 
10.09.2016: ప్రత్యేక హోదాపై జైట్లీ వైఖరి, చంద్రబాబు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్ చేపట్టింది వైసీపీ. 

 
10.09.2016: శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా ఆవశ్యకతను జ‌గ‌న్ పార్టీ నేత‌లు తెలియ‌చేశారు.

 
 26.01.2017: ప్రత్యేక హోదాకు మద్దతుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్‌ జగన్‌  వెళ్తుండగా ప్రభుత్వం విశాఖలో ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుంది. 

 
27.01.2017: ప్రత్యేక హోదాకోసం విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రజాస్వామికంగా ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించిన టీడీపీ ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసనలు 

 
10.03.2017:ప్రత్యేక హోదాను 15ఏళ్లపాటు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. 

 
28.03.2017: పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని లోక్‌సభలో ఎన్‌ఐటీ, ఎన్‌ఈఆర్‌ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పార్టీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. 

 
30.03.2017: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. 

 
06.04.2017: జీఎస్‌టీ కోసం 13, 14వ ఆర్థిక సంఘం సూచనలను పక్కన పెట్టి బిల్లును రూపొందించినట్టే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో జీఎస్‌టీ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

10.05.2017:ప్రత్యేక హోదా, అగ్రిగోల్డ్, రాష్ట్రంలో అవినీతి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ప్రభుత్వ విధానాలు, మిర్చికి మద్దతు ధర తదితర అంశాలపై మోదీని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

 
16.07.2017: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డిలు కేంద్రాన్ని కోరారు. 

         

20.11.2017: హోదా సాధనకు విపక్షాలు చేపట్టిన ఛలో అసెంబ్లీ ముట్టడికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు. వైఎస్సార్‌సీపీ నేతలతో సహా విపక్షాలు, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేసిన పోలీసులు 

 
10.12.2017: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అనంతపురం జిల్లా కూడేరులో జరిగిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, పోలవరం, విశాఖ రైల్వే జోన్‌తోపాటు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటిని నెరవేర్చేలా కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని నిర్ణయించారు. 

 
01.03.2018: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ ధర్నాలు నిర్వహించింది.  

03.03.2018:ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఆందోళనకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ శ్రేణులకు జెండా ఊపి పంపిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

 
05.03.2018:ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఢిల్లీలో సంసద్‌మార్గ్‌లో ధర్నా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు 

ఇక మార్చి 21 న కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్ట‌డానికి కూడా రెడీ అవుతున్నారు జ‌గ‌న్. ఇది ప్ర‌త్యేక హూదా ఉద్య‌మంలో వైసీపీ పాత్ర.. దీనిని ఆప‌డంలోనే తెలుగుదేశం వెన‌క‌పాకులాడుతూ ఉంది అని తెలుగుదేశం పై వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.