పవన్ జగన్ తో కలుస్తాడా? పీకే పిచ్చి కాకపోతే..!

YCP political advisor Prasanth kishore wants to meet Pawan Kalyan

వైసీపీ అధినేత జగన్ ఎలాగైనా సీఎం ను చేసేందుకు ఆ పార్టీ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే ప్లీనరీలో నవ పథకాలు, పాదయాత్ర వంటి కొన్ని ప్లాన్స్ ను రివీల్ చేసాడు. అయితే ఇవన్నీ జగన్ సీఎం కావడానికి సరిపోవు అన్నది ప్రశాంత్ కిషోర్ కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు పొత్తు రాజకీయాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఏపీలో కమ్యూనిస్టులు తో పాటు జనసేనను వైసీపీతో పొత్తుకు అంగీకరింప చేసేందుకు స్కెచ్ వేస్తున్నాడు.

అందులో భాగంగానే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని టాక్. ఇప్పటికే పవన్ అప్పాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించి అతను భంగపడ్డాడని చెప్పుకుంటున్నారు. పవన్ బిజీగా ఉన్నారని ఇప్పుడు కలవడం కుదరదని జనసేన కార్యాలయం ప్రశాంత్ కిషోర్ కు స్పష్టం చేసిందట. అయినా జగన్ తో పొత్తుకు పవన్ ను ప్రశాంత కిషోర్ ఏ విధంగా ఒప్పిస్తాడు అన్న విషయం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.