
వరల్డ్ ఫేమస్ లవర్ రివ్యూ & రేటింగ్
సమర్పణ: కె.ఎస్.రామారావు
బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్
తారాగణం: విజయ్ దేవరకొండ, రాశీఖన్నా, క్యాథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా లెయితె తదితరులు
సంగీతం: గోపీ సుందర్
కెమెరా: జయకృష్ణ గుమ్మడి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: కె.ఎ.వల్లభ
దర్శకత్వం: క్రాంతి మాధవ్
!!ఇంట్రో !!
టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్ అయ్యారు విజయ్ దేవరకొండ…ప్రస్తుతం యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా ముద్రవేసుకున్నారు.. ఏడు చిత్రాలు చేసినా అన్నీ హిట్ టాక్ తెచ్చుకున్నాయి, కుర్ర హీరోగా లవర్ బాయ్ గా ఫ్యామిలీ హీరోగా అందరి మన్ననలు పొందుతున్నాడు…పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం సినిమా సూపర్‌సక్సెస్‌లయ్యాయి.. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న వరల్డ్ ఫేమస్ లవర్అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు ఈ వరల్డ్ ఫేమస్ లవర్ కథేంటి నలుగురు హీరోయిన్స్ తో విజయ్ నడిపిన సినిమా ట్రాక్ ఏమిటి అనేది చూద్దాం.
!!కథ!!
గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశీ ఖన్నా) ప్రేమికులు. సహజీవనం చేస్తుంటారు. పెద్ద రచయిత కావాలనేది గౌతమ్ లక్ష్యం. అందుకని, గొప్ప జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి… ప్రతిరోజు ఇంట్లో ఏదో రాయాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఏమీ రాయడు. కొన్ని రోజులకు గౌతమ్ ప్రవర్తనపై యామినికి విసుగు వస్తుంది. బ్రేకప్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ బ్రేకప్ బాధలో గౌతమ్ ఏం చేశాడు? సీనయ్య (విజయ్ దేవరకొండ), సువర్ణ (ఐశ్వర్య రాజేష్), స్మిత మేడమ్ (కేథరిన్) కథకు, గౌతమ్-యామిని కథకు సంబంధం ఏమిటి? అసలు, గౌతమ్ పారిస్ ఎందుకు వెళ్ళాడు? అక్కడ అతడికి పరిచయమైన ఇజ (ఇజబెల్లా) ఎవరు? చివరికి, గౌతమ్ – యామిని కలిశారా? లేదా? మధ్యలో గౌతమ్ జైలుకు ఎందుకు వెళ్లాడు? అనేది సినిమా. ఇదంతా వెండితెరపై చూడాల్సిందే
!!విశ్లేషణ!!
ప్రేమ సినిమాలు ఎన్నో చూశాం అయితే ఇది చాలా వైవిధ్యభరితంగా సాగిన చిత్రంగా చెప్పాలి. ప్రేమలో ఒకరిపై మరొకరికి అంతులేని ఆరాధన ఉంటుందనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించారు. బ్రేకప్ తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన మనోవేదన అనుభవిస్తారనేది చూపించారు. సినిమా లవర్స్ కు ఎలా ఉన్నా సాధారణ లవర్స్ కు మాత్రం ఇది బాగా కనెక్ట్ అవుతుంది
విజయ్ దేవరకొండ ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే ఎపిసోడ్ వినోదాత్మకంగానూ, అదే సమయంలో హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతోనూ దర్శకుడు తెరకెక్కించారు. పారిస్ ఎపిసోడ్ లో అక్కడి అందాలను తెరపై అందంగా ఆవిష్కరించారు. సరికొత్త యాసతో సినిమాలో అన్నీ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో విజయ్ దేవరకొండ నాలుగు విభిన్న గెటప్పుల్లో కనిపించాడు.
రాశీ ఖన్నాతో బ్రేకప్ ఎపిసోడ్ లో అతడి గెటప్ అర్జున్ రెడ్డిసినిమాలో గెటప్ ను గుర్తు చేస్తుంది. అంతకుముందు కాలేజ్ ఎపిసోడ్ లో యువకుడిగా మెప్పించారు. ఇల్లందు నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ అయితే నటుడిగా విజయ్ దేవరకొండలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. బొగ్గు గని కార్మికుడిగా, పదో తరగతితో చదువు ఆపేసిన యువకుడిగా… తెలంగాణ యాసలో అదరగొట్టాడు, ఇక స్టైలిష్ లుక్ లో పారిస్ పార్ట్ అంతా సూపర్ గా చేశారు.
కథానాయకుల్లో ఐశ్వర్య రాజేష్ అందరికంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తుంది. మినిమమ్ మేకప్, చీరకట్టులో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది…స్మిత మేడమ్ పాత్రలో కేథరిన్ చక్కగా నటించారు. రాశి ఖన్నా కొన్ని సన్నివేశాల్లో బాగా చేశారు. ఇజబెల్లా ఫారిన్ పైలెట్ పాత్రకు సూట్ అయింది. తమిళ నటుడు జయప్రకాష్ తనకు అలవాటైన పాత్రలో, రిచ్ ఫాదర్ గా కనిపించారు. విజయ్ దేవరకొండ స్నేహితుడిగా ప్రియదర్శి పాత్ర కొద్దివరకూ పరిమితం చేశారు, అయినా కథలో ఆ పాత్ర బాగుంది…నేపధ్య సంగీతం బాగుంది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. లవర్స్ కి మాత్రం లవర్స్ డే నాడు ఇది బాగా కనెక్ట్ అవుతుంది.
బాటమ్ లైన్ ….ప్రేమికుల కోసమే ఈ సినిమా
రేటింగ్:…2.5/5