Cinetollywood

పవన్ పై గెలుపు – వస్తోంది మంత్రి పదవి పిలుపు

Winning on Pawan - Calling Minister to a Grandhi Srinivas

పశ్చిమగోదావరి జిల్లాలో మాస్ లీడర్ ఆయన, జిల్లాలో ఎవరికి లేనటువంటి యూత్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది.. ఏకంగా గ్రంధి సైన్యం అని యువత కూడా అక్కడ ఫామ్ అయింది అలా పిలుచుకుంటారు అందరూ. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయనే మాకు ముఖ్యం అంటారు. ఆ సెగ్మెంట్ భీమవరం, ఆంధ్రా సింగపూర్ గా చెప్పే ప్రాంతం, స్టేట్ లో ఓ ఐకాన్ ప్రాంతం, పాష్ కల్చర్ తో పాటు రాజకీయ కలర్ అద్దుకున్న పొలిటికల్ ప్లేస్ గా చెప్పాలి భీమవరం ప్రాంతాన్ని, ఈ ఎన్నికల్లో ఇది మరింత చర్చకు కారణం అయింది.

గ్రంధి శ్రీనివాస్, శీనన్న అని పిలుస్తారు ఇక్కడ అందరూ… మరి ఇప్పుడు వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే , ఈ పేరు ఇప్పుడు రాష్ట్రం అంతా వినిపిస్తోంది.. ముఖ్యంగా వైసీపీ శాసనసభాపక్షం సమావేశం జరిగిన సమయంలో కూడా గ్రంధి శ్రీనివాస్ అక్కడ హీరొ అయ్యారు.. జగన్ తర్వాత అందరూ ఆయనని విష్ చేశారు. ఎందుకు అంటే ఒక పొలిటీషన్ – మరో సినీ హీరోతో అక్కడ ఆయన పోటీ చేశారు, తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా వియ్యంకుడు ఓ పక్క, మరో పక్క పవన్ కల్యాణ్ ఇలా అనేక అవరోధాలు ఆయనకు వచ్చినా ఆయనకు చివరకు గెలుపు వచ్చింది.

గతంలోగ్రంధి శ్రీనివాస్ ఓ మాట అన్నారు, దానిపై స్టేట్ లో అంతా చర్చ జరిగింది. భీమవరంలో విచ్చలవిడిగా డబ్బులు మద్యం జనసేన పార్టీ పంచిందని ఆరోపించారు. కావాలి అంటే ఎవరైనా వెళ్లి అక్కడ ప్రజలనే అడగండి అని సవాల్ చేశారు… నిజంగా చాలా మంది కూడా ఒప్పుకున్న విషయం ఇది.. చాలా మంది జనసేన ఇక్కడ డబ్బులు పంచింది అని నేరుగా చెప్పారు, మరి రాజకీయాల్లో డబ్బు అంశం తీసుకురాను అని చెప్పిన పవన్, ఇక్కడ ఎలా డబ్బులు ఖర్చు చేశారు అనేది తర్వాత పెద్ద ఎత్తున విమర్శలకు కారణం అయింది. నిజంగా ఇది పవన్ కు తెలియకుండా జరిగిందా?

ఇక పవన్ పై గెలిచిన గ్రంధి శ్రీనివాస్ కు జగన్ మంత్రి వర్గం లో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. భీమవరం లో జరిగిన త్రిముఖ పోటీలో జనసేన సీఎం అభ్యర్థిగా బరిలో దిగిన పవన్ కళ్యాణ్ ను 8వేలు పైగా మెజారిటీతో ఓడించి తెలుగు రాష్ట్రాల తో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించారు ఆయన. ఇక జగన్ కూడా ఆయనకు బెస్ట్ విషెస్ చెప్పారు, టఫ్ పోటీ అనుకున్న పవన్ పై ఆయన గెలుపు చరిత్ర అని చెప్పాలి. ఇక్కడ మరో విషయం కూడా చర్చించుకోవాలి, జగన్ పశ్చిమలో పాదయాత్ర చేస్తున్న సమయంలో భీమవరం వచ్చిన సమయంలో భీమవరం నుంచి వైసీపీ తరపున గ్రంధి శ్రీనివాస్ పేరుని ప్రకటించారు, జిల్లాలో తొలి అభ్యర్దిగా ఆయన పేరుని జగన్ ప్రకటించారు, తర్వాత పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు, అయితే జిల్లాలో ఎక్కడా రానటువంటి జనం భీమవరంలో కనిపించారు, కనివిని ఎరుగనంత జనం భీమవరంలో జగన్ పాదయాత్రకు వచ్చారు, జగన్ కూడా ఆ జనాలని చూసి ఆశ్చర్యపోయిన సందర్భం. పవన్ కళ్యాణ్ ఎదురు నిలిచినా కూడా అదరక బెదరక తన గెలుపుతో ప్రజలకు మరింత దగ్గర అయ్యారు.. ఇక గ్రంధి కి జగన్ మంత్రి వర్గంలో సినిమా ట్రోగ్రఫీ మంత్రి పదవి గాని క్రీడా శాఖ మంత్రి పదవి కానీ వస్తుంది అని భావిస్తున్నారు.

అసలు పవన్ ఎందుకు ఇక్కడ పోటీ చేశారు అంటే ..పవన్ కల్యాణ్ సొంతంగా సర్వే చేయించుకుని భీమవరంలో పక్కాగా గెలుస్తా అని అక్కడ పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్వస్థలం మొగల్తూరు భీమవరం సమీపంలోనే ఉంది. పవన్ కళ్యాణ్ భీమవరంలో కొన్ని రోజులు విద్యాభ్యాసం చేశారు. ఆయనకు ఇక్కడ చాలామంది సన్నిహితులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పట్టణం కావడం కూడా ఆయన భీమవరం ఎంపిక చేసుకోవడానికి కారణం. జిల్లా పర్యటనలో వారం రోజులు ఆయన అక్కడ బస చేసి రాజకీయాలు కూడా అక్కడ అబ్జర్వ్ చేశారు. ఇక భీమవరం నుంచి ఈసారి త్రిముఖ పోటీలో ముగ్గురు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అవడం ఇక్కడ ఓట్లు చీలిపోలేదు కులం తరహాలో.

పవన్ సొంత వర్గం కాపు సామాజకవర్గం ఓట్లు సుమారు 60 వేల వరకు భీమవరంలో ఉన్నాయి ఇవి పవన్ కు వస్తాయి అని భావించారు. అవి కూడా ఆయనకు సగం కూడా ఇక్కడ రాలేదు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు పోటీలో నిలిచారు పైగామంత్రి గంటాకు ఆయన వియ్యంకుడు . ఆయన కాపు సామాజకవర్గానికి చెందిన నేత. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంధి శ్రీనివాస్ కూడా రాజకీయంగా ఫేమ్ ఉన్న నేత, వైయస్ కు బాగా నమ్మిన వ్యక్తి ఆయన 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇలా ఆయన రాజకీయం సాగింది. సో చూడాలి జిల్లాలో ఆయన పేరు మంత్రి కూర్పులో ఉంటుంది అని అంటున్నారు జూన్ 8 న ఈ సస్పెన్స్ వీడనుంది.

విశ్లేషణ-వీజీ

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.