Cinetollywood

విన్నర్ మూవీ రివ్యూ

winner movie review | Cinetollywood.com

విన్నర్‌ సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం విన్నర్. మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి మాస్ ఫాలోయింగ్ ని సాధించిన సాయిధరమ్… ఇటీవల తిక్క సినిమాతో బోల్తా పడ్డాడు. మరి విన్నర్ గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన అతను విజయం సాధించాడో లేదో తెలుసుకుందాం.

ఇక కధలోకి వెళ్తే..
ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్‌… సిద్ధార్థ్‌ గా, రకుల్‌… సితారగా, జగపతిబాబు… మహేందర్ రెడ్డిగా నటించారు. కోట్లకు వారసుడైన మహేందర్ రెడ్డి ఇంట్లోని వెళ్లిపోయి ప్రేమించిన అమ్మాయిన పెళ్లి చేసుకుంటాడు. కొడుకు సిద్ధార్థ్ పుట్టిన తరువాత భార్య చనిపోవటంతో కొడుకుని అపురూపంగా చూసుకుంటుంటాడు. ఇంతలో తండ్రికి బిజినెస్ లో నష్టాలు వస్తున్నాయని తెలుసుకుని మహేందర్ రెడ్డి తన కొడుకుతో సహా ఇంటికి తిరిగి వెళ్తాడు. అయితే తన కొడుకు నుండి మనవడ్ని దూరం చేయాలని ప్లాన్ వేస్తాడు మహేందర్ రెడ్డి తండ్రి. 20 సంవత్సరాల తర్వాత రామ్ గా పేరు మార్చుకున్న సిద్దార్ద జర్నలిస్ట్ గా కెరీర్ లో నిలబడతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా సితారని ప్రేమిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఆమె తండ్రి ఆమెకు సిద్ధార్థ్‌ రెడ్డితో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. అయితే సిద్ధార్థ్‌ రెడ్డికి, సిద్ధార్థ్‌ కీ పోటీ పెట్టమని ఆ పోటీలో గెలిచిన వాళ్లను పెళ్లి చేసుకుంటానని అంటుంది. అసలు రేసింగ్ లంటే ఇష్టంలేని సిద్ధార్థ్ హార్స్ రేసులో పాల్గొన్నాడా..? తన ప్రేమను గెలిపించుకున్నాడా..?మళ్లీ తన తండ్రిని కలుసుకున్నాడా..? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

ఇక కధనం ఏంటంటే:
కొడుకు వ్యవహారం నచ్చని ఓ తండ్రి… తన కొడుకు నుండి మనవడ్ని దూరం చేయడం, ఆ మనవడు తిరిగొచ్చి తాతకు బుద్ది చెప్పడమే విన్నర్ సినిమా కధ. ఈ ఫార్ములా ఎప్పట్నుంచో ఉన్నా దానికి కాస్త కమర్షియల్ డ్రామాను జోడించారు. తండ్రీ-కొడుకుల బంధానికి హార్స్‌ రేస్‌ నేపథ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్టాఫ్ నార్మల్ గా ఉన్నా సెకండాఫ్ లో వచ్చే హార్స్‌రేసింగ్‌ సన్నివేశాలు అలరిస్తాయి. ప్రీ క్లైమ్యాక్స్ లో సన్నివేశాలు ఊరించినా క్లైమ్యాక్స్ మాత్రం తేలిపోయింది.

ఎలా చేశారంటే:
సాయి ధరమ్ తేజ్ మరో సారి తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సీన్స్, డాన్సులో అదరగొట్టేశాడు. రకుల్ గ్లామర్ షోకి మాత్రమే పరిమితమయ్యింది. జగపతి బాబు మరోసారి తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. పృథ్వీ, అలీ, వెన్నెల కిషోర్‌ ల కామెడీ ఆకట్టుకుంది. స్పెషల్ సాంగ్ లో అనసూయ ఆకట్టుకుంది. దర్శకుడు పాత కథనే కమర్షియల్ హంగులతో తెరకెక్కించాడు. ఓవరాల్ గా విన్నర్ బాగా వీక్ గా ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.