మంత్రాలయంలో ఎవరి మంత్రం ఫలిస్తుంది

Who will be win the Mantralayam

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఊహించిన ఫలితాలను కర్నూలు జిల్లాలో సాధించలేకపోయింది. ఇక్కడ వైసీపీ మెజార్టీ స్ధానాలు గెలుచుకుంది. కాని తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులతో వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నారు చంద్రబాబు. అయితే అప్పటి నుంచి జగన్ కూడా ఇక్కడ జిల్లాని క్లీన్ స్వీప్ చేయాలి అని చూస్తున్నారు. అందుకే జిల్లాలో మెజార్టీ సర్వేలు చేయించి గెలుపు గుర్రాలకు జగన్ సీట్లు ఇచ్చారు. ఇటీవల పాణ్యం సీటు కూడా వైసీపీ తెలుగుదేశం మధ్య టఫ్ ఫైట్ జరిగింది .ఇక్కడ మరోసారి గౌరు కుటుంబానికి ప్రజలు పట్టం కడతారా, లేదా వైసీపీతరపున కాటసాని రాంభూపాల్ రెడ్డికి పట్టం కడతారా అనేది చూడాలి.

ఈ నేపథ్యంలో జిల్లాలోని మంత్రాలయం స్థానంపై తెలుగుదేశం పార్టీ గట్టిగానే ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బాలనాగిరెడ్డి గెలిచిన ఈ నియోజకవర్గంలో, ఆయనను ఓడించాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి తీవ్రంగా శ్రమించారు. అయితే పార్టీ తరపున ఎన్నికల సమయంలో ప్రచారంలో గొడవలు జరగడంతో ఇదంతా తనకు పాజిటీవ్ అవుతుంది అని అనుకుంటున్నారు తిక్కారెడ్డి.

మంత్రాలయం నియోజకవర్గంగా 2009 లో ఏర్పడింది. అయితే ఇక్కడి నుంచి మొదటిసారి బాలనాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఆయన వైసీపీలో చేరి గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపైన 7 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు వైసీపీ తరపున సిట్టింగ్ గా మరోసారి ఆయన టికెట్ సంపాదించి పోటీ చేశారు, సర్వేలు ఆయనకు పాజిటీవ్ గా రావడంతో టికెట్ ఇచ్చారు జగన్. ఇక్కడ మరోసారి ఆయన ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో ప్రచారంలో బాలనాగిరెడ్డి స్వగ్రామంలోకి తిక్కారెడ్డి వెళ్లారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది.ఈ గలాటాలో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.. దీంతో తనపై దాడి చేశారు అని స్ట్రేచర్ పైనే తిక్కారెడ్డి ప్రచారం చేశారు. ఇది సుమారు 5 నుంచి 10 వేల ఓటు బ్యాంకు తనకు కలిసి వచ్చేలా చేస్తుంది అని ఆయన భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా కలసి వస్తుంది అని భావించారు .. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం ఓటర్ల నాడి పట్టుకోవడం ఇరు పార్టీలకు ఇక్కడ కష్టంగా ఉందట.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.