
మంగళగిరికి వద్దంటే వెళ్లిన లోకేష్ పరిస్థితి ఏమిటి
మాయాబజార్ సినిమాలో ప్రతీ సీన్ చూడాలి అనిపిస్తుంది, కనురెప్ప వేస్తే ఏసీన్ మిస్ అవుతుందా అనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ నేతలకు గడిచిన ఆరునెలల కాలం అంతా గుర్తువస్తుందట.. ఏదీ మర్చిపోకూడదు అని భావిస్తున్నారు , వాస్తవంగా చెబితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు చేసిన రాజకీయ ప్రగల్బాలు అబ్బో ఎంత చెప్పినా తక్కువ అని చెప్పాలి. ఇక తెలుగుదేశం పార్టిక ఆశాజ్యోతి నిండు ఆశాకిరణం మా లోకేష్ బాబు అని చెప్పుకునే తెలుగుదేశం నేతలు, జీవితంలో ఫస్ట్ టైం పోటీ చేసి తన పార్టీ తరపున సీఎం అభ్యర్దిగా రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రిగా పిలుచుకునే లోకేష్ ఓటమి అసలు జీర్ణించుకోవడానికి సాధ్యం కావడం లేదు ఆ పార్టీ నేతలకు.
లోకేష్ అసలు ఎమ్మెల్సీ కం మంత్రిని ఎలా చేశారు అనేది ఇప్పటికి అర్ధం కానిది, పైగా ఎమ్మెల్సీగా రాజీనామా చేయించకుండా ఎన్నికల బరిలోకి దించడం కూడా పెద్ద ప్రశ్న, తన కుమారుడి గెలుపు పై బాబుకి కూడా నమ్మకం లేదు అని తేలిపోయింది. అందుకే జనాలు కూడా తిరస్కరించారు అసలు చంద్రబాబు ఈ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు. వద్దెంటే వెళ్లాను మంగళగిరికి అనే ట్యాగు మాత్రం మరో ఐదు సంవత్సరాలు అలాగే ఉంటుంది లోకేష్ కు.
ఈ ఎన్నికల్లో ప్రజలు మాత్రం లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా కూడా పనికిరాడు అని తేల్చారు. కాని చంద్రబాబు మాత్రం మంత్రిగా చేశాడు, అంతా కుమారుడిపై వాత్సల్యం అని చెప్పాలి, కాని ఇది ప్రజాస్వామ్యం మా తీర్పు మీరుపాటించాలి అని ప్రజలు తిరస్కరించారు చినబాబుని, తాము ఎంతో డెవలప్ చేసేసిన రాజధాని ప్రాంతం అని.. అక్కడ తమకు తిరుగు ఉండదని మంగళగిరిలో పోటీ చేస్తే.. అక్కడి ప్రజలు లోకేష్ ను చిత్తుగా ఓడించారు. ఇక మీడియాలు జాకీలు పెట్టి లేపినా, టీడీపీ నేతలు లోకేష్ కోసం పార్టీ బాధ్యతలు తీసుకోవాలి అని నిరాహారదీక్షలు చేసినా, బాబు మరో నలుగురు టీచర్లను పెట్టినా, సాధించేది ఏమీ ఉండదు. అందుకే లోకేష్ నెమ్మదిగా పార్టీని గాడిలో తన తండ్రి పెడుతుంటే, వెనుక ఉండి చూడటమే ఉత్తమం అని చెబుతున్నారు సీనియర్లు రాజకీయ విశ్లేషకులు. ఇక మీడియాలు కూడా పెద్ద పెద్ద లాండ్రో జాకీలు పెట్టి లేపినా వాటి స్క్రూలు పీకేయ్యడానికి జగన్ ఇక్కడ రెడీగా ఉన్నాడు సుమా..
విశ్లేషణ-వీజీ
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్