ఈ ఫోన్ వాడుతున్నారా అయితే వాట్సాప్స్ పనిచేయదు

Watsaps will not work if this phone is being used

ఇటీవలికాలంలో వాట్సాప్‌ లో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి ఫేస్‌బుక్‌ యాజమాన్యం తీసుకొచ్చింది. వాట్సాప్‌ లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్లు చాలా ఆదరణ పొందుతున్నాయి. తమ బంధువులు, స్నేహితులతో నిత్యం టచ్‌లో ఉండటానికి ఇప్పుడు చాలామందికి వాట్సాప్‌ నిత్యావసర సాధనంగా మారిపోయింది. ఈ యాప్‌ను తమ వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగఇస్తున్నారు. వాట్సాప్‌ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుంది? అయితే కొందరు యూజర్లకు ఈ బాధ తప్పకపోవచ్చు.

2016 చివరి నుంచి తమ ఫీచర్లను విస్తరిస్తున్న క్రమంలో కొన్ని మొబైల్‌ డివైజ్‌లలో వాట్సాప్‌ పనిచేయదు అని ఫేస్‌బుక్‌ యాజమాన్యం తెలిపింది. 2017 జూన్ ౩౦ నుండి ఈ వెర్షన్‌ ఫోన్లు ఉన్నవాళ్లు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకొని వాట్సాప్‌ సేవలను యథాతథంగా పొందవచ్చునని కంపెనీ తెలిపింది.
• ఐఫోన్‌ 3జీఎస్‌/ఐవోఎస్‌ 6
• నోకియా ఎస్‌40
• నోకియా సింబియన్‌ ఎస్‌60
• ఆండ్రాయిడ్‌ 2.1 , ఆండ్రాయిడ్‌ 2.2
• బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా)
• విండోస్‌ ఫోన్‌ 7.1

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.