
Saamanyudu Teaser
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద సామాన్యుడు సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు. నేడు ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో విశాల్ చెప్పిన డైాలాగ్స్ అదిరిపోయాయి.
విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చక్ర అంతగా హిట్ కాలేదు. ఎనిమీ పర్వాలేదనిపించింది. ఇక మొత్తానికి విశాల్ మరో సినిమాతో రెడీ అయ్యాడు. సామాన్యుడు చిత్రంతో తు ప శరవణన్‌ను విశాల్ దర్శకుడిగా పరిచయం చేయబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు. నేడు ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు.. ఒకరు జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు.. ఇంకొకరుఆ సామాన్యుల్ని డబ్బు, పేరు, పదవి, అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు.. ఆ రాక్షసుల తల రాతని మార్చి రాయాల్సిన పరిస్థితి ఒక రోజు ఓ సామాన్యుడికి వస్తుంది’ అనే డైలాగ్‌తో టీజర్ సాగుతుంది.
అంటే ఈ యుద్దం ఆపవా? అని విశాల్ ఫ్రెండ్ అంటే.. అది నా శత్రువు మీద ఆధారపడి ఉంటుంది అని విశాల్ ఎంతో ఇంటెన్సిటీతో అంటాడు. మొత్తానికి సామాన్యుడు యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ఈ టీజర్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇలాంటి పాత్రల్లో నటించడం విశాల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక డింపుల్ హయతి అందంగా కనిపించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా కుదిరాయి.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్