వినయ విధేయ రామ- రివ్యూ జానర్

vinaya-vidheya-rama-movie-review-rating

యాక్షన్ డ్రామా
తారాగణం : రామ్ చరణ్, కియారా అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాత : డీవీవీ దానయ్య

ఇంట్రో!! మెగా ఫ్యామిలీలో తనకంటూ ఓ ప్రత్యక స్ధానం సంపాదించుకున్న చిరంజీవి తనయుడు, రాంచరణ్ తనకు తగ్గ కథలు సెలక్ట్ చేసుకోవడంలో తెలుగులో మొదటి వరుసలో ఉంటాడు.. ఇక నిర్మాతల పాలిట మెగా హీరోలు బంగారు బాతులు ..అందుకే చెర్రీ కూడా నిర్మాతలని ఎప్పుడూ సేఫ్ లో ఉంచుతాడు అంటారు.. ఇక ఇటీవల రంగస్ధలం సినిమాతో బంపర్ హిట్ అందుకున్న చెర్రీ, మాస్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ చిత్రంలో నటించారు. మరి కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలో నేడు విడుదల అయింది, ఎలా ఉందో ఓలుక్కేద్దామా?

!!కథ !!
రామ (రామ్చరణ్)కు తన అన్నలంటే ప్రాణం. పెద్దవాడు భువన్ కుమార్(ప్రశాంత్) అంటే అందరికీ గౌరవం. తన వారి కోసం చదువును భవిష్యత్తును కాదనుకొని అన్నలను పెద్ద చదువులు చదివిస్తాడు రామ. భువన్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా వైజాగ్లో పనిచేస్తుండగా పందెం పరుశురాం (ముఖేష్ రుషి) అనే వ్యక్తితో గొడవ అవుతుంది. అన్నల జోలికి ఎవరు వచ్చిన సహించలేని రామ, పరుశురాంని అతడి అనుచరులను కొట్టి ఎలక్షన్లు సజావుగా జరిగేలా చూస్తాడు.

అదే సమయంలో బీహార్లోని ఓ ప్రాంతాన్ని తను కనుసైగలతో శాసిస్తున్న వ్యక్తి రాజు భాయ్ మున్నా (వివేక్ ఒబెరాయ్). రాజు భాయ్ తన ప్రాంతంలో ఎలక్షన్లే లేకుండా తనకు నచ్చిన వారినే పదువుల్లో పెట్టుకుంటున్నాడని తెలిసి, భువన్ కుమార్ను అక్కడికి ఎలక్షన్ కమీషనర్గా పంపిస్తారు. తనకు ఎవరు ఎదురొచ్చినా అంతం చేసే రాజు భాయ్, భువన్ కుమార్ను ఏం చేశాడు.? అన్న కోసం రామ ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. ఇది వెండితెరపై చూడాల్సిందే

!!విశ్లేషణ!!

ఇక ఇప్పటి వరకూ వచ్చిన స్టోరీలైన్ మాత్రం ఇది కాదు అని చెప్పాలి, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమాని తెరకెక్కించారు…ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాల తరువాత పక్కా మాస్ కమర్షియల్ సినిమాలో నటించిన రామ్ చరణ్, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్లో చరణ్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ కియారా అద్వానీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. పాటలు అవసరమైనప్పుడు వచ్చిపోవటం తప్ప పెద్దగా నటనకు ఆస్కారం లేదు.ఇక అక్కడక్కడా చిరు కనిపించినట్టు చరణ్ నటన కనిపిస్తుంది మెగా అభిమానులకు ఆకట్టుకుంటుంది.

ఇక చెర్రీకి వదిన పాత్రలో స్నేహ హుందాగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్లో ఆమె నటన బాగుంది. విలన్గా వివేక్ ఒబెరాయ్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ఆర్యన్ రాజేష్, ముఖేష్ రుషి, హరీష్ ఉత్తమన్, రవి వర్మ, మధునందన్ లు వారి పాత్రలను న్యాయం చేశారు.

బోయపాటి సినిమా అంటే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, హై ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మరీ అంత ఎక్కువ లేకపోయినా ఫైట్స్ మాత్రం అబ్బుపరిచారు అని చెప్పాలి. కథని రామ్ చరణ్ ని ఊహించి రాసినట్టే ఆ డైలాగులు ఆ మాడ్యులేషన్ బట్టీ తెలుస్తుంది ఇక్కడ దర్శకుడు మొత్తం తన ప్రతిభని యాక్షన్ పై మరోసారి పెట్టారు అని చెప్పాలి యాక్షన్ ఎపిసోడ్స్లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఇక సంక్రాంతికి మంచి సందడి చేసేలా ఉంది అని చెప్పాలి ఈ సినిమా.. ఇక సంక్రాంతి వీక్ వరుసగా వసూళ్లను ఇస్తుంది అనడంలో నో డౌట్ అని చెప్పవచ్చు.

!!ప్లస్ పాయింట్స్ !!
రామ్ చరణ్
కొన్ని యాక్షన్ సీన్స్
దర్శకత్వం
కియరా

!!మైనస్ పాయింట్స్!!
అతి హింస
నటులని ఇంకాస్త ఉపయోగిచుకోవాల్సింది

!!బాటమ్ లైన్ !!వినయ విధేయం ఈ రాముడిపట్ల ప్రేక్షకులు చూపిస్తారు

రేటింగ్ 2.75

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.