
వరుణ్ తేజ్ రచ్చ షురూ
వరుణ్ తేజ్, సాయీ మంజ్రేకర్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో రాబోతోన్న గని సినిమాను అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని మొదటి పాటను 26వ తేదీని విడుదల చేయబోతోన్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు. కమర్షియల్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూనే డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఎఫ్ 3కి ఓకే చెప్పాడు. అదే సమయంలో గని అనే సినిమాకు కూడా తలూపాడు. ఇక గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం కోసం వరుణ్ తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. కరోనా సమయంలోనూ బాక్సింగ్, జిమ్ అంటూ ఫుల్ బిజీగా గడిపాడు.
అయితే గని సినిమా మీద అంచనాలు పెంచేందుకు మేకర్స్ మంచి ప్లాన్స్ వేశారు. అందులో భాగంగానే గని ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయాయి. వరుణ్ ఇచ్చిన పంచ్‌కు పగిలిపోయింది. అలా మొత్తానికి వరుణ్ తేజ్ ఈసారి కూడా హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఆ ఫస్ట్ గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్, బాక్సింగ్ రింగ్ సెటప్‌కు తగ్గట్టుగా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్
ఇక ఈ సినిమాను జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. అక్టోబర్ 26వ తేదీన గని నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఉపేంద్ర ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ మీద మొదటి చిత్రంగా అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. సిదు ముద్ద, అల్లు బాబీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Gallery
Latest Updates
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్
-
Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit
-
ప్రియురాలు ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడి స్టోరీ “విక్రమ్ సినిమా”
-
‘అఖండ’లో జై బాలయ్య సాంగ్‌కి రవితేజ స్టెప్పులు.. వీడియో వైరల్: Ravi Teja
-
అల్లు అర్జున్ నటనపై మెగాస్టార్ కామెంట్స్..సుకుమార్‌తో చిరంజీవి మీట్
-
Ram Charanతో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నా:NTR ..ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే
-
రాజమౌళి:Ram Charan తెల్ల కాగితం లాంటివాడు.. తారక్ గురించి అంతా తెలుసు
-
పూర్ణ ప్రధాన పాత్ర లో నటించిన “బ్యాక్ డోర్” సినిమా రివ్యూ
-
అవన్నీ తెలియదన్న డైరెక్టర్…Radhe Shyam విడుదలపై క్లారిటీ
-
Saamanyudu Teaser