Cinetollywood

అల్లు అరవింద్ పెద్ద కుమారుడు భారీ సినిమా

Allu Bobby

వరుణ్ తేజ్ స్టార్ హీరో రేంజ్ కు తన సినిమా మార్కెట్ పెంచుకున్నారు.. ఇప్పుడు మెగా హీరోలతో కమర్షియల్ సినిమాలు అంటే చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు.. మరి ముఖ్యంగా ఈ ఏడాది వరుణ్ తేజ్ కు మంచి విజయాలు వచ్చాయి.. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు వరుణ్ తేజ్.. అయితే కథల ఎంపికలో కూడా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అల్లు ఫ్యామిలీ కొణిదెల ఫ్యామిలీ రిలేషన్ తెలిసిందే.. మంచి బాండింగ్ ఉన్న సినిమా ఫ్యామిలీ, ఇక అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బన్నీ వాసుకి అప్పగించి అక్కడ చిన్న సినిమాలు చేస్తున్నారు. పెద్ద సినిమాలు పనిలో పనిగా చేస్తున్నారు.

ఇక బన్నీ అల్లు అర్జున్ కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ ట్రాక్ లోఉన్నారు.. ఇక అల్లు శిరీష్ కూడా మంచి కధ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక వాళ్ల సోదరుడైన అల్లు బాబీ కూడా సినీమా రంగంలోకి దిగుతున్నాడు. ఇప్పటివరకూ ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతూ వచ్చిన సినిమాలకి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతను వహిస్తూ వచ్చాడు.

ఇక ఇప్పుడు నిర్మాణ బాధ్యతను పూర్తిగా తనపైనే వేసుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు… బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. భారీ హాలీవుడ్ .. బాలీవుడ్ సినిమాలకి యాక్షన్ కొరియోగ్రఫీని అందించిన లార్నెల్ స్టోవెల్ ఈ సినిమాకి ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. మొత్తం అరవింద్ ఈ సినిమా బాధ్యతని తన పెద్ద కుమారుడు బాబీకి అప్పగించారట, భారీ చిత్రంగా ఇది గీతా ఆర్ట్స్ నిర్మించనుందట. లార్నెల్ స్టోవెల్ దగ్గర ప్రస్తుతం వరుణ్ తేజ్ శిక్షణ తీసుకుంటున్నాడు.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.