ఆ సమయం వస్తే ఆత్మహత్య చేసుకుని చావాలి – వర్మ

That time comes to suicide - Varma sensational comments

దర్శకుల్లోకెల్లా రామ్గోపాల్ వర్మ ప్రత్యేకం. ఆయన మాట ఆయన విధానం ఆయన సినిమాలు ఏది చూసినా ఓ డిఫరెంట్ షేడ్, అతనిలో కోణాలు కనిపిస్తాయి.. అందుకే వర్మ అంటే ప్రతీ ఒక్కరికి ఓ అభిమానం. అలాగే మాస్ క్లాస్ అందరిని ఆలోచించేలా డిఫరెంట్ మూవీలు తీయడంలో గట్స్ ఉన్న దర్శకుడు అనే చెప్పాలి. ఆయన వేసే అడుగులు, తీసే సినిమాలు మాత్రం ఎవరికి అర్దం కావు. ఓసారి పొలిటికల్ జానర్ మరోసారి లవ్ మరోసారి పగలు కక్షలు ఇలా అన్ని జానర్లు టచ్ చేస్తారు వర్మ.

సినిమాల్లో సంచలనాలు సృష్టిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావటం వర్మ స్టైల్. ఇలా విచిత్రమైన, వివాదాస్పదమైన దర్శకుడిగా వర్మ ప్రతీ ప్రేక్షకుడి మదిలో మెదిలే వర్మ. తన జీవితం గురించి చివరి సమయంలో ఆ పరిస్దితి వస్తే ఏం చేయాలి అనేదానిపై తన వెర్షన్ చెప్పాడు..మరి ఆ విషయాలు తెలుసుకుందాం.

తనకు ఎక్కువగా పీడ కలలు వస్తుంటాయని అన్నారు వర్మ…. అయితే అందులో హారర్ నుంచి శృంగారం వరకూ అన్ని రకాల కలలు వస్తుంటాయని, కానీ తాను దేనికీ భయపడనని చెప్పాడు. ఒకవేళ మనం ఏదైనా ఇబ్బందితో రోగంతో మంచంపై పడుకొని వేరొకరి సహాయం తీసుకుని బతకాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా భయపడతానని అన్నాడు. అలాంటి పరిస్థితి వస్తే.. దానికంటే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం బెటరనేది తన అభిప్రాయమని తెలిపాడు వర్మ. మొత్తానికి వర్మ ఒకరిపై డిపెండ్ అయ్యే మనస్తత్వం కాదు కాబట్టి, ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారు అని అంటున్నారు. మరి చూశారుగా వర్మ స్ట్రైట్ ఆన్సర్.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.