
జనసేనలోకి రాధా ముహూర్తం ఫిక్స్
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీ రాజకీయం వేరు.. ఇప్పటికే కాపులకు కాపుకాసే పేరు ఉంది అంటే అది వంగవీటి రంగా అనే చెప్పాలి.. అయితే ఎన్నికల వేళ ఇక్కడ విజయవాడ వైసీపీలో లుకలుకలు వస్తున్నాయి.. ముఖ్యంగా పార్టీలో నేతలకు టిక్కెట్లు ఇవ్వడం పక్కన పెడితే ఇప్పటి వరకూ ఉన్న ఇంచార్జులను మారుస్తూ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ..ఇక ఇందులో విజయవాడ సెంట్రల్ సీటుని మల్లాది విష్ణుకి ఇచ్చి ఇక్కడ ఉన్నా ఇంచార్జ్ వంగవీటి రాధాని రోడ్డుపై నిలబెట్టేసినట్టు చేశాడు జగన్.. అయితే ఇది కావాలని చేశారా లేదా తూర్పు సెగ్మెంట్ తీసుకో అని చేశారో తెలియదు కాని.. ఇక్కడ కాపులు మాత్రం జగన్ ని ఆయన పార్టీని దుమ్మతెత్తిపోశారు.. అంతే కాదు ఇటు టీడీపీ కూడా ఇప్పుడే టికెట్ ఇస్తాం రాధా వస్తే చాలు అనేలా ఆఫర్ ఇచ్చింది. అయితే రాధా టీడీపీలోకి వెళ్లే ఆస్కారం లేదు.
ఈ సమయంలో జనసేన నుంచి మంచి ఆఫర్ వచ్చింది అని తెలుస్తోంది పవన్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఓ కాపుగారు పవన్ పార్టీలోకి రాధాని రమ్మని, కావాలి అంటే ఇప్పుడే తాను జనసేన నుంచి సెంట్రల్ సీటు హామీ ఇప్పిస్తాను హామీతో పాటు బీఫామ్ కూడా ఇస్తాను అని చెప్పారట… దీంతో వంగవీటి రాధా కృష్ణ ఆలోచనలో పడ్డారు. జగన్ నిన్ను పట్టించుకోకుండా వదిలినప్పుడు నువ్వు కూడా జగన్ గురించి పట్టించుకోవక్కర్లేదు అని చెప్పారట ఆయన అభిమానులు. దీంతో ఆయన కూడా పార్టీ మారాలి అని నిర్ణయానికి వచ్చారు అనే వార్తలు వినిపిస్తున్నాయి..ఇదే విషయాన్ని రాధా రంగా మిత్రమండలి సైతం నిర్ధారించింది..
తాజాగా జనసేనాని పవన్‌కు మద్దతుగా వంగవీటి యువసేన పేరుతో ఉన్న బ్యానర్లు.. విజయవాడలో దర్శన మిచ్చాయి. దీంతో ఇక, రాధా.. త్వరలోనే జనసేనాని చెంతకు చేరిపోవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఈ నెల 23 లేదా 25న ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్