గద్దలకొండ గణేష్ రివ్యూ

Valmiki movie review

!!ఇంట్రో!!

టైటిల్ పై ఈ సినిమా గురించి వివాదాలు వచ్చాయి దీంతో విడుదలకు ముందు సినిమా పేరు మార్చేశారు..వాల్మీకి టైటిల్ ను చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్ గా మార్చారు.. అయితే సినిమాలు కథలు వైవిధ్యంగా ఉండాలి అని చూసే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం గద్దలకొండ గణేష్ .. తమిళ్ లో జిగర్తాండకు రీమేక్ గా వచ్చింది.. మరి వరుణ్ లుక్ తో పాటు సినిమాపై హైప్ కూడా పెరిగింది.. మరి చిత్రం ఎలా ఉందో లుక్కేద్దాం.

!!కథ !!

కథలోకి వెళ్లినట్టయితే గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్) ఒక పేరు మోసిన గ్యాంగ్ స్టర్.ఇదే క్రమంలో అభిలాష్(అథర్వ) దర్శకునిగా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక రోజున తన కుటుంబంతో ఒక్క సంవత్సరంలో దర్శకునిగా మారి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తాడు.అలా ఒక నిజమైన గ్యాంగ్ స్టర్ కథను తియ్యాలని భావించి గద్దలకొండ గణేష్ ను ఫాలో అవుతాడు.అలా అయ్యిన అథర్వ గణేష్ తో సినిమా చేసాడా?అసలు ఈ గద్దలకొండ గణేష్ అనే వ్యక్తి ఎవరు?అతను ఎందుకు అలా మారాడు?అసలు వీరిద్దరూ సినిమా చేసారా లేదా?ఈ కథకు పూజా హెగ్డే పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

!! విశ్లేషణ !!

కొత్తరకం కథను సెలక్ట్ చేసుకునే వరుణ్ తాజాగా ఈసినిమా కథ కూడా అలాగే ఎంచుకున్నా, రీమేక్ అయినా తన పాత్రకు న్యాయం చేశాడు వరుణ్… ఇక ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో పక్కా మాస్ లుక్ ఉన్న సినిమాగా ఇది ఆకట్టుకుంది. అంతేకాదు ఊరమాస్ ప్రేక్షకులను నాలుగు సార్లు సినిమా చూసేలా డైలాగులు ఉన్నాయి. ఇక సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం అంత ఊహించిన విధంగా సాగలేదు.

ఖచ్చితంగా వరుణ్ – హరీష్ శంకర్ ల కాంబినేషన్ పై చాలా మంది మంచి అంచనాలను పెట్టుకొని ఉంటారు.అవి నీరసించిపోడానికి ఎంతో సమయం పట్టదు.పెద్దగా ఆసక్తికరంగా సాగని కథనం అంతగా ఇంప్రెస్ చెయ్యని మిక్కీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ హాఫ్ కు అంతగా కలిసిరావు. కాస్త మెతకగానే ఫస్ట్ ఆఫ్ సాగింది. ఇక సినిమాలో తన లుక్ డైలాగులు అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్ కరెక్టుగా వరుణ్ కు సెట్ అయ్యాయి.

ఇక సినిమాకు ప్రాణం అంటే సెకండాఫ్ అని చెప్పాలి.. ఇక్కడ నుంచి కధ కాస్త ముందుకు సాగింది. ఇక హీరోయిన్ పూజ పాత్ర బాగుంది .. ఇద్దరి మధ్య లవ్ సన్నివేశాలు మాటలు బాగున్నాయి. మాస్ లుక్ తో క్లాస్ మాటలు అందరిని ఆకట్టుకుంటాయి. అప్పటి గోల్డెన్ హిట్ సాంగ్ ఎల్లువొచ్చి గోదారమ్మపాట కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఎమోషనల్ సీన్స్ సినిమాకు రెండు చోట్ల హైలెట్ గా నిలిచాయి. కాస్త ఎడిటింగ్ లోపం కనిపించింది. సినిమా పెద్దది అయిందనిపిస్తుంది.ఓవరాల్ గా వరుణ్ కు మాస్ లుక్ లో క్లాస్ హిట్ అయితే ఈ మూవీ అని చెప్పాలి.

!!ప్లస్ పాయింట్స్ !!
వరుణ్ లుక్ డైలాగులు
పాత్ర
కథనం

!!మైనస్ పాయింట్స్!!
నిడివి ఎక్కువ
ఇంకా ఎడిటింగ్ చేయాల్సింది
అథర్వ పాత్ర

!!బాటమ్ లైన్!!
మొత్తానికి గద్దలకొండ గణేష్ మాస్ కు బాగా నచ్చినా క్లాస్ ప్రేక్షకులు మాత్రం ఇంకా ఏదో ఉండాల్సింది అనే క్వశ్చన్ అడిగేలా ఉంది.

!!రేటింగ్!! 3

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.