ఏపీలో గెలుపెవరిది ఉండవల్లి ఏం చెప్పారంటే ?

Undavalli speaks about AP Election results

ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి. అయితే తెలుగుదేశం వైసీపీ తమదే అధికారం అని చెబుతుంటే, జనసేన మాత్రం తక్కువ ప్రచారంగానే తాము అధికారంలోకి వస్తాము అని చెబుతున్నారు. పవన్ కూడా తాను ఇప్పుడు ఏదో సీఎం అయిపోవాలి అని అనుకోవడం లేదు అనిచెప్పారు. అయితే తెలుగుదేశం వైయస్సార్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఈసారి ఎన్నికల్లో హోరా హోరీగా తలపడ్డాయి. ఎవరికి వారు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ వార్డ్ మెంబర్ మొదలు సీఎం అభ్యర్ది వరకూ అందరూ కూడా తమదే గెలుపు అని చెబుతున్నారు. అయితే 2014లో బాబుకు అవకాశం ఇచ్చిన జనాలు 2019 జగన్ కు అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నారట.

అంతేకాదు ఇదే విషయం ఎక్కువగా సర్వేలు తెలియచేశాయి. పెద్ద ఎత్తున జాతీయ మీడియాలు చేసిన సర్వేలు కూడా ఇదే విషయాన్ని తెలియచేశాయి.. అయితే సీనియర్ లీడర్లు తెలంగాణ నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. కచ్చితంగా జగన్ కు ఈసారి అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ కూడా దీనిపై ఏమనుకుంటున్నారు యాంటీ గవర్నమెంట్ ఓటు బ్యాంకు జగన్ కు కలిసి వస్తుందా, లేదా బాబు సంక్షేమ పథకాలు చంద్రబాబుకు కలిసివస్తాయా? లేదా జగన్ కు బాబుకు కు కాకుండా పవన్ కు ఓటు వేశారు అని భావిస్తున్నారా అనే అంశంలో ఓ మీడియా ఆయన అభిప్రాయం తీసుకుంది.

ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది పెద్దఎత్తున ఓటు వేశారు అనేది తెలిసిందే.. అయితే పసుపు కుంకుమ ఇందులో పాజిటీవ్ గవర్నమెంట్ కు అయింది అంటున్నారు.. అంతేకాదు వైసీపీ ఈ విషయాన్ని జనాల్లోకి ఎలా తీసుకువెళ్లింది, మన డబ్బు మనకు చంద్రబాబు ఎన్నికల ముందు ఇస్తున్నాడు అనేది జగన్ ప్రచారం చేశారు.. మరి ఇది జనాలు ఎలా అర్దం చేసుకున్నారు. వారి ఆలోచన ఎలా ఉంది అనేది ఎవరూ చెప్పలేరు. మొత్తానికి ఎన్నడూ జరగని రీతిలో ఈసారి ఎన్నికలు జరిగాయి..ఎన్నికలకు ముందు పదివేల రూపాయలు బ్యాంకు ఖాతాలో వేయడం అనేది దేశంలో ఇదే మొదటి సారి అని ఆయన అన్నారు. కచ్చితంగా ఎవరు గెలుస్తారు అనేది మాత్రం అంత సులువుగా ఎవరూ గెస్ చేయలేరు అని చెప్పారు ఆయన.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.