
ఒకే దెబ్బకు రెండు దెబ్బలు పవన్ పొలిటికల్ పంచ్
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు మినహా ఎవరితో కలిసి ముందుకు వెళ్లము అని కుండబద్దలు కొట్టారు.. ఇది మంచి పరిణామం అని చెప్పాలి.. సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న విమర్శలు వార్తలు ఇక గాసిప్స్ లేకుండా ఆయన క్లారిటీ ఇచ్చారు అనే భావించాలి… అయితే పవన్ కల్యాణ్ ఇలా 175 సెగ్మెంట్లలో తాము అభ్యర్దులని ప్రకటిస్తాం తామే స్వయంగా పోటీ చేస్తాం, ప్రతిపక్షం అధికార పక్షం చేస్తున్న వ్యాఖ్యలు పట్టించుకోకండి అని చెప్పడం వెనుక కారణం ఉంది.. జనసేన పై వీరు ఇరువురూ కూడా కుట్ర చేస్తున్నారు అనేది పవన్ రాజకీయంగా గ్రహించారు.
మా వద్దకు పవన్ వస్తారు అంటే, తమ వద్దకు పవన్ వస్తారు అని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.. చంద్రబాబు కూడా పవన్ సాయం చేయాలి అని కోరుతున్నారు.. ఇక బాబు దగ్గరకు అసలు పవన్ వెళ్లే ఛాన్స్ లేదు. ఓసారి మోసపోయినందుకే పవన్ చింతిస్తున్నారు. ఇక మరోసారి ఆయన వెళ్లే అవకాశం లేదు అని తెలుస్తోంది. అలాగే జగన్ కూడా పవన్ ని డ్యామేజ్ చేసేలా రాజకీయాల్లో వాడకూడని భాష ఆయన పర్సనల్ విషయాలు తీశారు.. సో జగన్ వద్దకు కూడా పవన్ వెళ్లాలి అని భావించడం లేదు. అందుకే పావుగా అవ్వకూడదు అని పవన్ తన స్టేట్ మెంట్ ఇచ్చారు అని తెలుస్తోంది.
ఇక పవన్ కు రాజకీయంగా ఎదురుదెబ్బలు తగలకూడదు అంటే, దీనిపై స్పష్టమైన అభిప్రాయం చెప్పాలి.. లేకపోతే ప్రజల్లో కేడర్ పార్టీ పై విశ్వాసం సన్నగిల్లుతుంది అని జగన్ కు బాబుకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన దెబ్బ కొట్టారు.. సో రాజకీయంగా విమర్శలు చేస్తూ పబ్బం గడపడం వేరు ఇలా పార్టీని ఇరుకునపెట్టి మనం పబ్బం గడుపుకుందాం అనడం వేరు.. ఇలా రెండు పార్టీలు అవకాశం కోసం గోడదగ్గర కూర్చున్నాయి అనేది తేలిపోయింది.. అందుకే పవన్ సత్యాన్ని గ్రహించి ఒకే దెబ్బకు రెండు పార్టీలకు పంచ్ ఇచ్చారు అని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్