
ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ డెసీషన్.. త్రిష ఎంటర్!
కమల్ హాసన్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా భారతీయుడు 2 (ఇండియన్ 2). చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ పనులు జరుగుతున్నాయి. కొన్ని అనివార్య కారణాలతో గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. భారతీయుడు సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే క్రమంగా ఆ వివాదాలు సద్దుమణగడంతో తిరిగి డిసెంబర్ నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ కోసం తగిన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారట దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.
ఈ భారీ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకుందట. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ‘ఇండియన్ 2’ నుంచి తప్పుకుందని ఇన్ సైడ్ టాక్. అయితే కాజల్ అగర్వాల్ ప్లేస్‌లో త్రిష ఎంటర్ కాబోతోందని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం రానుందని అంటున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాజేష్, వివేక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో వచ్చిన భారతీయుడు పలు రికార్డులను చెరిపేయడంతో ఈ సీక్వల్‌పై జనాల్లో భారీ అంచనాలున్నాయి.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్