ముగ్గురి పేర్లు ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

Three candidate names announced Janasena Chief Pawan Kalyan

జనసేన శంఖారావ సభలో పవన్‌ కల్యాణ్ దూకుడుకి స‌భ జ‌రిగిన గుంటూరే కాదు, యావ‌త్ ఏపీ ఆలోచ‌న‌లో ప‌డింది. తెలుగుదేశం జ‌న‌సేన వైసీపీ ఈ మూడు పార్టీల్లో ప్ర‌జ‌లు ఏ పార్టీక ఓటు వెయ్యాలి అనేది తేల్చుకునే స‌మ‌యంలో ,ఏపీలో బాబు పాల‌న పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేశారు… అంతేకాదు ప్ర‌తీ సెగ్మెంట్లో జ‌న‌సేన సింగిల్ గా పోటీ చేస్తుంది అని, అవినీతి అంతం చేయాలి అంటే ఆ బుర‌ద‌లోకి నేను దిగుతాను అని చెప్పారు.

కొంతమంది నాయకులు పగలు జనసేన అంటూ తిరుగుతూ.. రాత్రిళ్లు టీడీపీ నాయకుల ఇళ్లల్లో ఉంటున్నారు. మన చుట్టుపక్కలే వాళ్లు ఉన్నారు. అది నాకు తెలుసు. ఉదాహరణకు పగలంతా జనసేన అంటూ తిరిగే నేతలు రాత్రివెళ్లి గంటా ఇంట్లో ఉంటున్నారు.. వీరికి త‌గిన గుణ‌పాఠం చెబుతాన‌న్నారు, ఇక సీనియ‌ర్లు త‌న‌ని తొక్కేస్తున్నారు అని కొంద‌రు పిచ్చి పిచ్చి వ్యాఖ్య‌లు చేస్తున్నారు.. అలాంటి వారు నా ప‌క్క‌న ఎవ‌రూ లేరు అని ఇలాంటి వ్యాఖ్య‌లు చేసేవారే ఆలోచించుకోవాలి అని, తాను మీరు అనుకునే అంత బ‌లహీనుడ్ని కాదు అని అన్నారు. తాను ఎప్పుడు అధికారంలోకి వ‌స్తే అప్పుడు ముఖ్య‌మంత్రిని అయ్యి ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తా అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్.

గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పవన్‌ ప్రకటించారు. నాదెండ్ల మనోహర్‌ (తెనాలి అసెంబ్లీ), రావెల కిశోర్‌బాబు(నియోజకవర్గం చెప్పలేదు), తోట చంద్రశేఖర్‌(గుంటూరు లోక్‌సభ) నుంచి పోటీ చేస్తారన్నారు. సో ప‌వ‌న్ ముగ్గురి పేర్లను ప్ర‌క‌టించారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్దులుగా.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.