పవన్ లిస్ట్ రెడీ తొలి జాబితాలో ఎంతమందంటే ?

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగునున్నతరుణంలో గణతంత్ర దినోత్సవం రోజు జనసేన అభ్యర్థులను ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే ఇప్పుడు పవన్ అందరికంటే ముందు తన పార్టీ తరపున వచ్చే ఎన్నికల్ల్లో పోటీ చేసేది ఎవరు అనేది తెలియచేస్తారా అనే ఆలోచన తెలుగుదేశం వైసీపీకి వస్తోంది.. ఎటువంటి సర్వేలు ఆయన చేయకుండా అభ్యర్దులను చెబుతున్నారా అంటే పార్టీలో సీనియర్లుగా ఉన్నవారిని పవన్ ముందు అభ్యర్దులుగా ఎవరు ఉంటారో వారి పేర్లు చెబుతారు అని తెలుస్తోంది.. తొలి జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉండవచ్చు, లేకపోవచ్చు కానీ రిపబ్లిక్ డే రోజు కొంత మందితోనైనా తొలి జాబితా ప్రకటించాలని యోచిస్తున్నట్లు పవన్ తెలిపారు.

జనవరి నెలాఖరుకు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తానన్నారు. నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబాలు ఉన్నాయని, జిల్లా వారి చెప్పు చేతల్లో చిక్కుకుపోయిందన్నారు. వారి నుంచి జిల్లా ప్రజలకు విముక్తి కలిగించాలంటే యువత బలంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన కార్యకర్తలు బలంగా ఉన్నారని, నెల్లూరు పాత నాయకులను ఢీకొనే శక్తి వారికి ఉందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. అయితే పవన్ చెప్పిన దానిలో చాలా వాస్తవం ఉంది ఆనం, మేకపాటి, ఇలా కొందరి కుటుంబాల చేతిలో రాజకీయంగా నెల్లూరు జిల్లా చిక్కుకుంది..

వారి పొలిటికల్ స్కూల్ నుంచి వచ్చిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు జనసేన తరపున కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని పవన్ చూస్తున్నారు.. దేశం పై ఎంతో ప్రేమ ఉన్న పవన్ రిపబ్లిక్ డే రోజు అభ్యర్దుల లిస్ట్ చెబుతాను అని అనడం పార్టీలో నాయకులకు మరింత జోష్ తీసుకువచ్చింది అని చెప్పాలి.. సుమారు 50 మంది పేర్లు ఉంటాయి అని తూగో పగోలో అభ్యర్దుల లిస్ట్ ఉంటుంది అని తెలుస్తోంది.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.