పవన్ కు దూరంగా ఉంటున్న చిరు ఇదే రీజన్

This is a reson for short-lived chiru for Pawan - Janasena

పవన్ కల్యాణ్ కు మెగా కుటుంబం నుంచి ఎటువంటి అండదండలు ఉన్నాయి అనేది. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు చేసిన సాయం బట్టీ తెలుస్తోంది.. ఆయన పార్టీకి దూరంగా ఉన్నా జనసేనలో చేరకపోయినా, తన గొప్ప మనసుతో పవన్ కు 25 లక్షల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఫండ్ ఇచ్చారు.. ఇక ఆయన కుమారుడు వరుణ్ బాబాయ్ పార్టీ జనసేనకు కోటి రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది..అయితే జనసేనకు ఇంత భారీ విరాళం ప్రకటించడం కొసమెరుపు అనే చెప్పాలి.. ఇక పది రోజుల నుంచి నాగబాబు కూడా పవన్ కు సపోర్ట్ గా ఎటువంటి కామెంట్లు చేయకపోయినా, పరోక్షంగా బాలయ్యకు చురకలు అంటిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీలో నాగబాబుకి పవన్ అంటే ఎంతో ఇష్టం. పవన్ అంటే చిరుకి ప్రాణం అనేది తెలిసిందే.. పవన్ని చిరు సినిమాల్లోకి తీసుకువచ్చారు అనేది అందరికి తెలిసిన వాస్తవం.

అయితే ఇప్పుడు అంతా కూడా పవన్కు చిరు, చరణ్ కూడా విరాళం ఇస్తారా..? ఇవ్వరా..? అన్న విషయంపై పార్టీవర్గాలతోపాటు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పది రోజులుగా ఇదే విషయం పై చర్చ అయితే జరుగుతోంది. అయితే ఇక్కడ లాజిక్స్ సీక్రెట్స్ ఏమీలేవు. కేవలం పవన్ కు నాగబాబు సపోర్ట్ చేయడానికి కారణం ఆయన ఏ రాజకీయ పార్టీలో లేరు కాబట్టి.. కాని చిరంజీవి అలా కాదు కేంద్రంలో మాజీ మంత్రిగా చేశారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు రాజ్యసభ పదవి కాలం పూర్తి అయినా, ఆయన ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారు. సో అందుకే పవన్ కు ఆయన ఎటువంటి విరాళం ఇవ్వలేదు.

ఇక చరణ్ కాని అల్లు అర్జున్ కాని విరాళం ఇవ్వడానికి కుదరదు. ఎందుకు అంటే ఆ మార్క్ చిరు మీద పడుతుంది.. ఇక సాయి ధరమ్ తేజ్ చిన మావయ్య పవన్ కల్యాణ్ కు జనసేన పార్టీకి విరాళం ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది .. ఆయన 25 లక్షలు జనసేనకు పార్టీ విరాళంగా ఇవ్వాలి అని మెగా ఫ్యామిలీ తరపున ఆలోచిస్తున్నారట. ఇక దీనిపై ఆలోచించేది ఏమీ లేదు అని పవన్ కు రాజకీయంగా ఇబ్బంది ఉండకూడదు అని చిరంజీవి జాగ్రత్తపడ్డారు అని చెబుతున్నారు మెగా బంధువులు. సో దీని వెనుక ఉన్న వాస్తవం అయితే ఇది.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.