పవన్ ముందు వామపక్షాలు పెట్టిన లిస్టు ఇదే

This is a list of left-wing parties before Pawan

వచ్చేఎన్నికల్లో తెలుగుదేశం వైసీపీ ఏ పార్టీతో పొత్తులు లేవు అని, కేవలం ఒంటరి పోరుతోనే జనసేన ప్రజల ముందుకు వస్తోంది అని తెలియచేశారు పవన్ కల్యాణ్.. అయితే కమ్యూనిస్టులతో పవన్ కల్యాణ్ ఎటువంటి రాజకీయ ఒప్పందం చేసుకుంటారు అనేది ఇప్పుడు చర్చ …గత రెండు మూడు నెలలుగా ఇదే చర్చ జరుగుతోంది.. వామపక్షాలతో కలిసి జనసేన అధినేత ఏపీలో పోటీ చేయనున్నారు అని తెలుస్తోంది.. సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరిపి ఆయన పార్టీ తరపున ఈ విషయం ప్రకటిస్తారు అని అంటున్నారు.. గోదావరి జిల్లాల్లో ఒకటి, రెండు స్థానాలకే వామపక్షాలు పరిమితం కాబోతున్నాయి. ఈ దిశగానే ఇప్పటిదాకా జనసేన అంతర్గత కసరత్తు నడిపినట్టు మరో సమాచారం.

ఇక్కడ జనసేన చాలా స్ట్రాంగ్ గా ఉండటమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. తెలుగుదేశం వైసీపీ బీజేపీ కాంగ్రెస్ ఇలా అన్నిపార్టీలు పోటికి రెడీ అవుతున్నాయి.. ఇది టఫ్ వార్ గా ఉండే ఎన్నిక.. ఇక ఇటీవల వామపక్షాల భావజాలం, తమ పార్టీ భావజాలానికి సారూప్యత ఉండడంతో కలిసి ప్రయాణానికే సిద్ధమని ప్రకటించారు. ఇక రెండు పార్టీలు ఒప్పందం చేసుకుని సీట్ల సర్దుబాటు చేసుకోవాలి.

ఇకజనసేన తరపున ఈసారి గత ఎన్నికల ఫార్మూలాని ఉపయోగించాలి అని చూస్తున్నారు..2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం పోలవరం, ఆచంట నియోజకవర్గాల నుంచి పోటీ చేసింది. సీపీఐ మాత్రం పోలవరం, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఇక ఇప్పుడు కూడా పవన్ ను ఈ స్ధానాలు తమకు కేటాయించాలి అని కోరనున్నారట. తాడేపల్లి గూడెం ఏలూరులో జనసేనకు చాలా బలమైన కేడర్ ఉంది మరి పవన్ ఎటువంటి డెసిషన్ ఇక్కడ తీసుకుంటారో చూడాలి.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.