జనసేన తొలిజాబితాలో వీరికి చోటు

They are the first list candidate in Janasena party

కాపులు అందరూ ఇప్పుడు జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలిసిందే..ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ఎంతో కీలకమైనది అని చెప్పాలి.. ఇప్పుడు ఆ పార్టీ ఇక్కడ వైసీపీ టీడీపీకి గట్టి పోటీ ఇస్తోంది.2019 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈనెల 26వ తేదీన ప్రకటిస్తానని జనసేన అధినేత పవన్కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే..దీంతో ఉభయగోదావరి జిల్లాల్లో నేతలు ఆశలు పెట్టుకున్న వారు అందరూ మరికొన్ని రోజుల్లో మా పేర్లు పవన్ ప్రకటిస్తారు అని ఆనందంలో ఉన్నారు.

ముమ్మిడివరం నుంచి బీసీ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ
ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ
రాజమహేంద్రవరం రూరల్ నుంచి కందుల దుర్గేష్,
తుని నుంచి రాజా అశోక్బాబు
మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు
కాకినాడ రూరల్ నుంచి అనిశెట్టి బుల్లెబ్బాయి
పి.గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి
రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ పేర్లు ప్రకటిస్తారు అని తెలుస్తోంది

ఇక రెండు జిల్లాల్లో 34 అసెంబ్లీ సెగ్మెంట్లు 5 ఎంపీ స్ధానాలు ఉన్నాయి.. ముఖ్యంగా వీటిలో చాలా వరకూ కేడర్ బలంగా ఉంది.. అలాగే కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు అభ్యర్దులు కూడా పోటికి రెడీగా ఉన్నారు.. సో జనసేన అభ్యర్దుల లిస్టు వైసీపీ టీడీపీ కంటే ముందు విడుదల చేసి, పవన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లే చెప్పాలి ..ఇంకా ఆ రెండు పార్టీలు ఎవరు ఎవరు మా పార్టీలో చేరుతారు అని ఆలోచనలో మునిగిపోయాయి అనేది తెలిసిందే.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.