ఏపీకి 2018-19 బ‌డ్జెట్ లో ద‌క్కిన‌వి ఇవే ?

These are the same for the AP in the 2018-19 budget

2018 – 19 లో ప్ర‌వేశ పెట్టిన వార్షిక  బ‌డ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు… తెలుగు రాష్ట్రాల్లో రైల్వే కేటాయింపులు అనుకున్నంత స్ధాయిలో జ‌ర‌గ‌లేదు, ఇక జోన్ ల‌పై కూడా ఎటువంటి స్ప‌ష్టత ఇవ్వ‌లేదు కేంద్రం.

దీంతో ఇటు వైసీపీ తెలుగుదేశం కూడా డైల‌మాలో ఉన్నాయి.. ఇక ఎన్నిక‌ల‌కు కేవ‌లం సంవ‌త్స‌రం మాత్ర‌మే ఉంది. చివ‌రి బ‌డ్జెట్ ఇలా నిరాశ‌ప‌ర‌చ‌డంతో  ప్ర‌జ‌లు కూడా ఆలోచ‌న‌లో ఉన్నారు.
కోటిపల్లి-నర్సాపూర్‌ కొత్త రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు రూ. 430 కోట్లు కేటాయింపు

విజయనగరం-స్తంభాలపూర్‌ మూడో రైల్వేలైన్‌కు రూ. 90 కోట్లు

నడికుడి-కాళహస్తి కొత్త రైల్వే లైన్‌కు రూ. 340 కోట్లు

కాజీపేట-విజయవాడ మూడో రైల్వేలైన్‌కు రూ. 100 కోట్లు

నల్లపాడు-గుంతకల్‌ లైను విద్యుదీకరణకు రూ. 150 కోట్లు

విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నర్సాపూర్‌-నిడదవోలు రైల్వేలైన్ల డబ్లింగ్‌ పనులకు రూ. 122 కోట్లు కేటాయింపు
విజయనగరం-రాయగడ-రాయపూర్‌ విద్యుదీకరణకు రూ. 120 కోట్లు

విజయవాడ-గూడురు మూడోలైన్‌కు రూ. 100 కోట్లు

ఓబులవారి పల్లె-కృష్ణపట్నం కొత్త రైల్వేలైన్‌కు రూ. 100 కోట్లు

గుంతకల్‌-బళ్లారి హోస్పేట్‌ విద్యుదీకరణకు రూ. 70 కోట్లు

కడప-బెంగళూరు రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు రూ. 240 కోట్లు

కాకినాడ-పిఠాపురం కొత్త రైల్వేలైన్‌కు రూ. 150 కోట్లు

మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ కొత్త రైల్వేలైన్‌కు రూ. 300 కోట్లు

మనోహరాబాద్‌ (మేడ్చల్‌)-కొత్తపల్లి (కరీంనగర్‌) లైన్‌కు రూ. 350 కోట్లు

అక్కన్నపేట-మెదక్‌ మధ్య 17 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు రూ. 196 కోట్లు

భద్రాచలం నుంచి సత్తుపల్లి కొత్త రైల్వేలైన్‌కు రూ. 300 కోట్లు

కాజీపేట-బళ్ళారీ మూడోలైన్‌కు రూ. 160 కోట్లు

సికింద్రాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులకు రూ. 50 కోట్లు

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రెండోఫేజ్‌కు రూ. 100 కోట్లు

రూ. 5 కోట్లతో చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్‌ టర్మినల్‌

తెలంగాణలో నిర్మాణం కానున్న ఏ-1 స్టేషన్లు

విభజన హామీలను కేంద్ర బడ్జెట్‌ విస్మరించింది..ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, ఇనిస్టిట్యూషన్‌లకు కొంత మేర నిధులు కేటాయించారు. అయితే ప్యాకేజీ పై స్పెష‌ల్ స్టేటస్ పై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు కేంద్రం
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు
ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు

గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు

ఎన్‌ఐటీకి రూ.54 కోట్లు

ఐఐటీకి రూ.50కోట్లు

ట్రిపుల్‌ ఐటీకీ రూ.30 కోట్లు

ఐఐఎంకు రూ.42 కోట్లు

ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49 కోట్లు

దేశవ్యాప్తంగా అన్ని ఎయిమ్స్‌లకు రూ.3,018 కోట్లు

విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.32 కోట్లు

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌కు రూ.19.62 కోట్లు

స్టీల్‌ ప్లాంట్‌కు రూ . 1400 కోట్లు

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.