శ్రీకాకుళంలో సైకిల్ పార్టీకి దారుణమైన ఎదురుదెబ్బ

tdp-krishna

అన్నీ కాలాలు ఒకలా ఉండవు, అలాగే అన్ని రోజులు మనకు అనుకూలం అవ్వవు, రాజకీయాల్లో ఇది మరింత చెప్పే విషయం. ఎప్పుడు మనకు కంచుకోట అని ఏ రాజకీయ పార్టీ ఓ స్ధానం పై ఆశలు పెట్టుకోకూడదు, ఏకంగా టీడీపీ అలాంటి సెగ్మెంట్లు గురించి 2004 ఎన్నికల్లో కూడా అలాగే ఆశలుపెట్టుకుని దారుణమైన ఫలితాలు చూసింది..2019 ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు చూడబోతోంది అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. నాటి ఫలితాలు తెలుగుదేశం పార్టీకి రిపీట్ అవుతాయి అని కొందరు చెబుతున్నారు. దానికి కారణం కూడా ఉంది. బాబు పాలనపై రెండోసారి విరక్తి చెందారు అనేది సర్వేలలో అలాగే జగన్ పాదయాత్రలో ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పట్టిన విధానం చూస్తే తెలుస్తుంది అంటున్నారు విశ్లేషకులు.

ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఈసారి తెలుగుదేశం పార్టీకి దారుణమైన ఫలితాలు రాబోతున్నాయి అని చెబుతున్నాయి ఏ సర్వేలు చూసినా, గత ఎన్నికల్లో మెజార్టీ తెలుగుదేశం స్ధానాలు సాధించింది. కాని ఈసారి ఆ సీన్ ఇక్కడ ఫలితాలలో కనిపించదు అంటున్నారు. ఇక్కడ మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో టీడీపీ 7 వైసీపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలిచింది.కాని ఈసారి తెలుగుదేశం రెండు స్ధానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉంది అని చెబుతున్నారు.

ఈసారి ఇక్కడ వైసీపీ చాలా బలమైన అభ్యర్దులను బరిలోకి దించింది.. అలాగే ఇక్కడ అభివృద్ది కూడా ఏమీ కనిపించడకపోవడం కూడా టీడీపీకి వ్యతిరేకత చూపిస్తోంది.. అసలు జనసేన బోణీ కూడా ఇక్కడ కొట్టే అవకాశం లేదు అంటున్నారు విశ్లేషకులు. ఏ సర్వే చేసినా శ్రీకాకుళంలో పార్లమెంట్ స్ధానం కూడా టీడీపీ కోల్పోయే ప్రమాదం ఉంది అంటున్నాయి. సో చూడాలి సిక్కోలు రాజకీయ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.