Cinetollywood

ఆర్ఎక్స్ 100 కి ముందు టాప్ హీరో అనుకున్నారంట ఎవ‌రంటే

The top hero is expected before the RX 100 movie

అతి త‌క్కువ బ‌డ్జెట్ తో తెరకెక్కి చిన్న సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.ఆర్ఎక్స్ 100 …ఈ  సినిమాపై ఇప్ప‌టికే మంచి ఫేమ్ సాధించుకుంది.. బోల్డ్ మూవీగా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకుంది. ఇప్పటికే ఫ‌స్ట్ వీక్ 10 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు వ‌సూలు చేసింది అని టాక్ అయితే బ‌య‌ట న‌డుస్తోంది.. ముఖ్యంగా ఈసినిమాని చూసిన వారు అంద‌రూ అర్జున్ రెడ్డి త‌ర‌హా బోల్డ్ మూవీలా ఉంది అని అంటున్నారు…..ఈ సినిమాతో కార్తికేయ హీరోగా ప‌రిచ‌య‌మయ్యాడు. ఇక ద‌ర్శ‌కుడు వ‌ర్మ అసిస్టెంట్ గా ఇండ‌స్ట్రీకి తెలిసిన వ్య‌క్తి.. వ‌ర్మ‌ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన ద‌ర్శకుడు అజ‌య్ భూప‌తి మంచి పేరు సంపాదించాడు ఈ సినిమాతో…ఇక ఈ ఫిల్మ్ స‌క్సెస్ లో ఆయ‌న క్రెడిట్ ఎంతో ఉంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి, చ‌ర్చ బ‌య‌ట ఎలా ఉన్నా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సినిమా ముందు టాలీవుడ్ లో స‌మ్మోహ‌నంతో స‌క్సెస్ అందుకున్న సుధీర్ బాబుతో చేయాలి అని ద‌ర్శ‌కుడు అజ‌య్ భావించార‌ట‌.. ఈ సినిమా క‌థ చెప్ప‌డానికి మూడు నెల‌లు సుధీర్ బాబు కోసం ట్రై చేశార‌ట‌. కాని ఆయ‌న ఈ సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపించ‌లేద‌ని దీంతో కొత్త హీరోని ప‌రిచ‌యం చేశార‌ట ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి.. మొత్తానికి ఎవ‌రికి ఏది రాసిపెట్టి ఉంటే అదే అనేది మ‌రోసారి తేలింది.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.