
కేంద్ర సర్వీసుకు బాబు అధికారులు ఏపీలో మరో సంచలనం
తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెంటనే తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు అఫీషియల్ గా ఉన్న ఉద్యోగులను నియమించుకుంటాయి ప్రభుత్వాలు.. ముఖ్యంగా సీఎం కోరిక మేరకు ఇలాంటివి అన్నీ జరుగుతాయి.. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు కూడా ఏపీలో అధికారంలోకి రావడం, నాలుగు సంవత్సరాలు కలిసి ఉండటంతో ఏ అధికారులు కావాలి అన్నా ఏపీకి వచ్చేశారు.. చిటికెలో పనిలా బాబుకు కలసి వచ్చింది.
అయితే ఎన్నికల సమయంలో అలాగే బీజేపీ తెలుగుదేశం విడిపోవడంతో ఇక అధికారుల బదిలీలు ఏమీ కుదరలేదు.. ఇప్పుడు ఏ సర్వే చూసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెబుతున్నాయి.. ఈ సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే బాబు తీసుకువచ్చిన అధికారులు అందరూ తమ పరిస్దితి ఏమిటి అని ఆలోచిస్తున్నారట. కొందరు ఆయన సామాజిక వర్గం వారు కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు అని తెలుస్తోంది… మరో 25 రోజులు ఏపీ ఫలితాలకు సమయం ఉండటంతో ఇప్పటి నుంచే కేంద్ర సర్వీసుకు ధరఖాస్తు చేసుకున్నారట.
ఏపీలో జరుగుతున్న సర్వేలు విడుదలవుతున్న మార్కెట్ సర్వేల ప్రకారం కచ్చితంగా జగన్ సీఎం అవుతారు అని తెలుస్తోంది.. అందుకే వారు ఇక్కడ నుంచి జగన్ సీఎం అయ్యేలోపు కేంద్ర సర్వీసుకి బదిలీ అవ్వాలి అని చూస్తున్నారట… ఏపీకి బదిలీపై వచ్చిన కేంద్ర సర్వీసు అధికారులంతా ఇప్పుడు మళ్లీ అక్కడికే వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.
మే 23 తరువాత రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేకనుక, ఆ జగన్ పరిపాలన సమయంలో తప్పక లెక్కలు చూస్తాడని, ఆ సమయంలో తామిక్కడ ఉంటే ఆ అవకతవకల్లో తమ మెడకూ ఉచ్చు బిగిస్తుందన్న కారణంగా కేంద్ర సర్వీసులకు క్యూ కడుతున్నారట నేతలు.. అయితే అధికారులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కొందరు కిందిస్ధాయి ఉద్యోగులు కూడా ఇదే విషయం పై ఆలోచన చేస్తున్నారు ఎందుకు ఉన్నత అధికారులు కంగారు పడుతున్నారని ఆలోచనలో పడ్డారు. ఇక వైసీపీ నేతలకు కూడా ఈ విషయం లీక్ అయింది. అయితే ఎవరు ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా అవకతవకలు జరిగితే తప్పక కేసులు మెడకు చుట్టుకుంటాయి అని చెబుతున్నారు విశ్లేషకులు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్