
డ్రమ్మింగ్.. హమ్మింగ్.. కుమ్మింగ్.. ఇక దుమ్ముదుమారమే!…సర్కారు వారి పాట
Sarkaru Vaari Paata Music: రీసెంట్‌గా ‘సర్కారు వారి పాట’ ట్యూన్ కంపోజ్ చేస్తున్న వీడియోను పంచుకొని సినిమా పాటలపై ఆతృత పెంచేసిన తమన్.. తాజాగా ”డ్రమ్మింగ్.. హమ్మింగ్.. కుమ్మింగ్” అంటూ మరో పోస్ట్ పెట్టారు.
సంగీత దర్శకుల్లోకెల్లా తమన్ చాలా డిఫరెంట్. ఓ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడమే కాదు ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఎప్పుడూ ముందుంటారు ఈ మ్యూజిక్ సెన్సేషన్. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తాను మ్యూజిక్ అందిస్తున్న సినిమాల అప్‌డేట్స్ పంచుకుంటూ స్టార్ హీరోల అభిమానులను హుషారెత్తిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సర్కారు వారి పాట’ గురించిన ఓ అప్‌డేట్ ఇస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు తమన్. రీసెంట్‌గా ‘సర్కారు వారి పాట’ ట్యూన్ కంపోజ్ చేస్తున్న వీడియోను పంచుకొని సినిమా పాటలపై ఆతృత పెంచేసిన తమన్.. తాజాగా ”డ్రమ్మింగ్.. హమ్మింగ్.. కుమ్మింగ్” అంటూ మరో పోస్ట్ పెట్టారు. దీన్నిబట్టి చూస్తుంటే అతి త్వరలో ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతోందని అర్థమవుతోంది. దీపావళి కానుకగా ఈ సాంగ్ విడుదల కావొచ్చనే టాక్ నడుస్తోంది. ఇక తమన్ పోస్ట్ చేస్తున్న ఈ అప్‌డేట్స్ చూస్తుంటే ఈ సాంగ్ దుమ్ము దుమారం రేపడం ఖాయమే అనిపిస్తోంది.
మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ సినిమాను భారీ బడ్జెట్ కేటాయించి మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ బాణీలు కడుతుండగా.. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలోని ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లో జరిపారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో చేస్తున్నారు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో మహేష్ కీర్తి పై సాంగ్స్ చిత్రీకరణ జరుగుతోంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మహేష్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్