రాసిపెట్టుకోండి లోకేష్ తో సహా 18 మంది మంత్రులకు ఓటమి

Telugu Desam Party loss eighteen ministers including with Lokesh

అట్టర్ ప్లాప్ సినిమా విడుదల కాకముందే టాక్ వచ్చినట్లు, తెలుగుదేశం పార్టీకి ఇంకా రిజల్ట్ రాకుండానే టెన్షన్ పెరిగిపోయింది. ఎవరు ఎక్కడ మీడియా సమావేశం పెట్టినా బాబు సంగతి అయిపోయింది రాజకీయంగా ఇక రిటైర్డ్ అవ్వాలి అని అంటున్నారు. మరో పక్క మాత్రం మహానాయకుడు కథానాయకుడు సినిమా చూసిన వారు అయినా తమకు ఓట్లు వేయరా అనేలా బాలయ్య ధీమాగా ఉన్నారు.. ఆ సినిమాలాగానే బాబు రాజకీయం తెలుగుదేశం ఫలితాలు ఉంటాయి అంటున్నారు.. అయితే బాబుకు ఈసారి ఎన్నికల్లో ఓట్లు ఎలా పడ్డాయో తెలియాలి అంటే మే 23 వరకూ ఆగాల్సిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ వెళ్లి చేయి ఇచ్చింది. అంత పెద్ద హస్తానికి ఈ తెలుగుదేశం హస్తం ఇవ్వడంతో దారుణంగా ఓడిపోయారు. అసలు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ కూడా కాంగ్రెస్ కు లేకుండా పోయింది అంటారు.

ఇక బాబు రాకపోతే తెలంగాణలో కచ్చితంగా కాంగ్రెస్ 30 స్ధానాలుపైనే గెలుచుకునేది అంటారు కాని అంతా జరిగిపోయింది. మరో 5
సంవత్సరాల వరకూ నో డిస్కషన్స్.. ఇక తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన మంత్రులు చాలా మంది ఓడిపోతారట అంతేకాదు మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి అక్కడే ఎమ్మెల్యేగా నిలబడి పార్టీకి స్టార్ క్యాంపెయినింగ్ చేసిన చంద్రబాబు తనయుడు, మంత్రి నారాలోకేష్ మంగళగిరిలో ఓడిపోతారట. తాజాగా వైసీపీ నాయకుడు కమెడియన్ పృథ్వీ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియచేశారు.. అయితే ఆయన చెప్పడం ఎలా ఉన్నా ఇప్పుడు ఇదే మాట రాష్ట్రం అంతా చర్చించుకుంటున్నారు.

మంగళగిరిలో ప్రచారం చేసిన సమయంలో జనాలని అడిగా అందరూ ఆర్కే మాకు ఎమ్మెల్యేగా కావాలి అన్నారు.. సీఎం తనయుడు అయినా సరే పట్టించుకోలేదు , అందుకే అక్కడ ఆర్కే గెలుస్తారు అని తెలియచేశాడు కమెడియన్ వైసీపీ నాయకులు ఫృధ్వీ.. టీడీపీలో ఉన్న 18 మంది మంత్రులలో ఎవరూ గెలివరు. నేను మాట ఇస్తున్నా.. ఇది రాసిపెట్టుకోండి. ఎలక్షన్స్ తరువాత నన్ను అడగండి. ఒక్క మంత్రి కూడా గెలవడు. ఇది నర్మగర్భం. మొన్న టీడీపీ వాళ్లు ఢిల్లీ వచ్చారు. వాళ్ల ఫేస్లు చూడండి. టెక్కలి నుంచి వచ్చిన అచ్చెం నాయుడు బలవంతంగా నవ్వుతున్నాడు. ఎందుకంటే మా పని అయిపోయింది వెళ్లిపోతున్నాం అనే భయం వాళ్లలో మొదలైంది. చక్కగా ఈ ఐదేళ్లు ప్రకృతి ఆశ్రమంలో జాయిన్ అయ్యి ఆరోగ్యాలు కాపాడుకోమనేది నా సలహా అంటూ ఛాలెంజ్ చేశారు పృథ్వీ. మరి ఈవైసీపీ నాయకుడి చాలెంజ్ విని తెలుగుదేశం నేతలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.