Cinetollywood

తేజ్.. ఐ లవ్ యు రివ్యూ & రేటింగ్

Tej I Love You Movie Review and rating

నిర్మాణ సంస్థ‌: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ మూవీ మేక‌ర్స్‌
తారాగ‌ణం: సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు
సంగీతం: గోపీ సుంద‌ర్
ఛాయాగ్ర‌హ‌ణం: అండ్రూ.ఐ
మాట‌లు: డార్లింగ్ స్వామి
కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
క‌ళ‌: సాహి సురేశ్‌
స‌హ నిర్మాత‌: వ‌ల్ల‌భ‌
నిర్మాత‌: కె.ఎస్‌.రామారావు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎ.క‌రుణాక‌ర‌న్‌

!! ఇంట్రో !!

మెగా హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తెలుగు చ‌ల‌న చిత్ర రంగానికి ప‌రిచ‌యం అయ్యాడు.. ఇక వరుస విజయాలు వ‌చ్చినా ప‌రాజయాలు కూడా చూశాడు.. ముఖ్యంగా తిక్క సినిమా నుండి ఇంటెలిజెంట్ సినిమా వ‌ర‌కు ఐదు వ‌రుస ప‌రాజ‌యాల‌ను చ‌విచూశాడు… ఇక హిట్ కొట్టాలి అనే కోరికతో ల‌వ్ ఓరియెంటెడ్ చిత్రాలు తీసే ద‌ర్శకుడు కరుణాక‌ర‌న్ తో జ‌త‌క‌ట్టాడు.. ఇక నాలుగేళ్ల గ్యాప్ ఇచ్చిన క‌రుణాక‌ర‌ణ్ ఇప్పుడు తేజ్ ఐల‌వ్ యూ చిత్రంతో తేజ్ తో ముందుకువచ్చాడు.. మ‌రి ఎలా మెప్పించారు అనేది ఈరోజు విడుద‌లైన ఈచిత్ర స‌మీక్ష‌లో తెలుసుకుందాం.

క‌థ‌
తేజ్ సాయిధ‌ర‌మ్‌తేజ్ ప‌ద్ధ‌తిగ‌ల కుటుంబానికి చెందిన అబ్బాయి. ఓ స‌మ‌స్య కార‌ణంగా అత‌న్ని, అత‌ని పెద‌నాన్న జ‌య‌ప్ర‌కాష్ కుటుంబం నుంచి బ‌య‌ట‌కు వెలివేస్తాడు. దాంతో కాలేజీ అయిపోయాక స‌ప్లీలు రాసుకుంటూ హైద‌రాబాద్‌లోని బాబాయ్ పృథ్వి ఇంట్లో ఉంటాడు… అలా కాలేజీలో కొంత మంది స్నేహితుల‌తో క‌లిసి ఓ రాక్ బ్యాండ్‌ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలాంటి స‌మ‌యంలోనే అత‌నికి నందిని అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌ ప‌రిచ‌య‌మ‌వుతుంది. అనుకోకుండా జ‌రిగిన అగ్రిమెంట్ కార‌ణంగా 15 రోజులు ఆమెకు అత‌ను బాయ్ ఫ్రెండ్‌గా న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు.

ఇక ఆ గ‌డువు పూర్త‌య్యేలోపు ఆమే అత‌నికి గ‌ర్ల్ ఫ్రెండ్‌గా న‌టించ‌డానికి సిద్ధ‌ప‌డుతుంది. ఇలా ఒక‌రికి ఒక‌రు చేరువ‌య్యే క్ర‌మంలో నందినికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ కి కార‌ణం ఎవ‌రు? న‌ందినిని ఫాలో చేస్తున్న వారు ఎవ‌రు? ఆమెకు ఎవ‌రి వ‌ల్ల ప్ర‌మాదం. లండ‌న్ నుంచి నందిని అస‌లు ఇండియాకు ఎందుకు వ‌చ్చింది? ఆమె తండ్రి ఆమెకు మంచి చేశాడా? చెడు చేశాడా? ఇంత‌కీ తేజ్‌, నందిని ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారా? ఆ విష‌యం ప‌రస్ప‌రం చెప్పుకున్నారా? లేదా? అనేది వెండితెర‌పై చూడాల్సిందే

విశ్లేష‌ణ‌!! సినిమా పేరులోనే తేజ్ ఐలవ్యూ అని ఉండ‌టంతో ఈ సినిమా మంచి ల‌వ్ స్టోరీ బేస్ క‌థ అని అనిపించింది అంద‌రికి.. పైగా క‌రుణాక‌ర‌న్ క‌లం అదే క‌థ‌ల‌కు పెట్టిన పేరు కాబ‌ట్టి అంద‌రూ అదే అనుకున్నారు..అయితే అనుకున్న‌ట్లు ఇది కొత్త‌కాదు ప‌లు ర‌కాల క‌థ‌లు వ‌చ్చిన విధంగానే ఉంది.. అల్లిక‌ల క‌థ‌లాగానే క‌నిపించింది. అయితే ముందు ప్రేమిస్తున్నావా అంటే లేదు అని అన‌డం ,త‌ర్వాత ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌టంఇలాంటివి తెలుగు క‌థ‌లు చాలా చూశాం.. అయితే ఇక్క‌డ కొత్తగా అనిపించింది ఏమీ లేదు.. ఇక చెల్లెని న‌చ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయ‌డం ఇంట్లోంచి హీరోని బ‌య‌ట‌కు పంప‌డం కూడా కొత్త కాదు..క్లైమాక్స్ కూడా పాత‌క‌థ‌గానే చూపించారు.. అది కొత్త‌థ‌నం ఎక్స్ పెక్ట్ చేసినా అది జ‌రుగ‌లేదు..పాత పాట‌తోనే స్టార్టింగ్ ట్యూన్ ఎందుకు తీసుకున్నారా అనేది పెద్ద ప్ర‌శ్న.. పాటలు స్వ‌రాల పై మ‌రి కాస్త ఆలోచించాల్సింది..

చిరంజీవి, నాగ‌బాబుని తేజ్ అక్క‌డ‌క్క‌డా ఇమిటేట్ చేయ‌డం అభిమానుల‌కు న‌చ్చుతుంది సినిమాలో.. అనుప‌మ కూడా త‌న పాత్ర‌కు త‌గిన న్యాయం చేసింది.. తేజ్ ఫ్యామిలీ కూడా అద్బుతంగా న‌టించారు.. వారిని తీసుకున్న సెల‌క్ష‌న్ విధానం బాగుంది.. డైరెక్ట‌ర్ ఇక్క‌డ బాగా స‌క్సెస్ అయ్యారు.. ఇటు తేజ్ కూడా బాగా న‌టించినా, రోటిన్ క‌థ స‌న్నివేశాల‌లానే కనిపించింది వెండితెర‌పై.. వైవా హ‌ర్ష‌కు కొన్నాళ్ల గ్యాప్ త‌ర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ ప‌డింది.. హ‌ర్షాకు ఇది ప్ల‌స్ అయ్యేఅంశం. మెగా అభిమానుల‌కు నిరాశ‌కాక‌పోయినా తేజ్ వారి ఆశలు ఈ సినిమాతో మాత్రం తీర్చ‌లేదు అని టాక్.

ప్ల‌స్ పాయింట్లు
సాయిధ‌ర‌మ్‌తేజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ఇత‌ర న‌టీన‌టులు
లొకేష‌న్స్, కాస్ట్యూమ్స్
అక్క‌డ‌క్క‌డా చిరు నాగ‌బాబును ఇమిటేట్ చేసిన విధానం

మైన‌స్ పాయింట్లు
రొటీన్ క‌థ‌
సంగీతం
స్క్రీన్‌ప్లే
బాట‌మ్ లైన్ !! తేజ్ ఐల‌వ్యూ…. ఆ ల‌వ్ లో ఫీల్ ఎక్క‌డా లేదు

Cinetollywood.com రేటింగ్ – 2.5/5

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.