జ‌గ‌న్ లేఖ‌తో టీడీపీ కుదేలు

TDP Dilemma with YS Jagan Latter | cinetollywood

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న జోరును పెంచుతున్నారు బాబు స‌ర్కారుకు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నారు ఎటువంటి చిన్న త‌ప్పిదం జ‌రిగినా ప్ర‌తిప‌క్షం త‌ర‌పున  త‌న వాయిస్ ను రేజ్ చేస్తున్నారు జ‌గ‌న్… తాజాగా పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ కు ప‌లువురు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఏక‌ర‌వు పెడుతున్నారు.. ఫాతిమా కాలేజీ విద్యార్ధులు జ‌గ‌న్ కు త‌మ స‌మ‌స్య‌ను తెలియ‌చేశారు దీనిపై జ‌గ‌న్ వారికి భ‌రోసా క‌ల్పించారు..

కడ‌ప ఫాతిమా కాలేజీ విద్యార్ధుల స‌మ‌స్య‌పై జోక్యం చేసుకోవాల‌ని, కాలేజీ యాజ‌మాన్యం చేసిన త‌ప్పుకు విద్యార్ధులు శిక్ష అనుభ‌విస్తున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి జేపీ న‌డ్డాకు లేఖ రాశారు.. దీంతో తెలుగుదేశం నాయ‌కులు కంగుతిన్నారు.. ముఖ్యంగా రాయ‌ల‌సీమకు అన్ని తాను చేస్తున్నాను అని చెప్పే చంద్ర‌బాబు, ఆ విద్యార్ధుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక పోతున్నారు అనే అప‌వాదులు మూట‌గ‌ట్టుకున్నారు.

ఫాతిమా కాలేజీ 2015-16 బ్యాచ్‌ విద్యార్థుల అడ్మిషన్లను సరైన వసతులు లేని కారణంగా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఎమ్‌సీఐ రద్దు చేసింది. తొలి రెండు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగులో విద్యార్థుల చేరికకు ఎమ్‌సీఐ అనుమతి ఇవ్వలేదు. కాలేజీ యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులతో మూడో దశ కౌన్సెలింగులో 100 మంది విద్యార్థులను చేర్చుకున్నారు.  త‌ర్వాత  ఈ విద్యార్థుల సీట్లను ఎమ్‌సీఐ రద్దు చేసింది. దీంతో ఆ విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోయింది.

 తమకున్న సీట్లలోని వంద సీట్లను ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి నిరాకరించడంతో, ఇతర కాలేజీల్లో చేర్చాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నో ఆశలతో మెడిసిన్‌ పూర్తి చేయాలనుకున్న వారి కలలు కల్లలయ్యాయి. ఇతర కాలేజీల్లో ఫాతిమా విద్యార్థులకు అవకాశమివ్వండి. విద్యార్థులకు న్యాయం జరగాలంటే మీరు జోక్యం చేసుకోవాలని వైఎస్‌ జగన్‌ లేఖలో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర స‌ర్కారుకు ఎన్ని విన‌తులు ఇచ్చినా జోక్యం చేసుకోలేద‌ని, దీనిపై విద్యార్ధులు మండిప‌డుతున్నారు.. జ‌గ‌న్ కు త‌మ స‌మ‌స్య చెప్పుకోగానే వెంట‌నే స్పందించార‌ని విద్యార్ధులు ఆనందం వ్య‌క్తం చేశారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.