జగన్ పై సర్వేల దాడి..టీడీపీ కొత్త ప్లాన్!

TDP attacks YCP on new political war

ఇటీవల మీడియాలో కొన్ని వార్తలు చూస్తే రాజకీయ వ్యూహాలకు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రధాన వేదికగా మారిపోయిందా? అన్న అనుమానాలు రాకమానవు. సోషల్ మీడియా, అనుకూల మాథ్యమాల ద్వారా అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు వ్యతిరేక ప్రచారానికి దిగుతున్నారు. తాజాగా అటువంటి వార్తే ఒకటి పొలిటికల్ సర్కిల్ లో హల్ చల్ చేసింది.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో జగన్ , ఒక రహస్య సర్వే చేయించారని ఆ సర్వేలో వచ్చిన ఫలితాలతో జగన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారన్నది ఆ వార్త సారాంశం. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం నిలుపుకుంటుందని, వైసీపీకి 45 సీట్లు , జనసేనకు 13 సీట్లు వస్తాయని తేలిందట.

ఈ వార్తను ప్రచారం చేసింది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమపై ఎంతటి వ్యతిరేకత ఉన్నా తాము చాలా బలంగా ఉన్నామని చెప్పుకోవడంతో పాటు ప్రత్యర్ధులు చాలా బలహీనులు అని చెప్పడమే ఆ ప్రచారం అని చెవులు కొరుక్కుంటున్నారు. పనిలో పనిగా ఈ సర్వే చేయించడానికి జగన్ కు , 10 కోట్లు ఖర్చయ్యాయని, ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరే అంటూ జగన్ పై సింపతీ కూడా చూపించారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.